తెలుగు నేలపై అనేక ఉద్యమాలు వచ్చాయి.. వెళ్లాయి. ఇప్పుడు మరోసారి ఓ మహా ఉద్యమమే జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని ఆ ప్రాంతంలో వేల ఎకరాలు ఇచ్చిన రైతులు 14 రోజులుగా ధర్నాలు, నిరసనలూ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి దీక్షకు విపక్షాలు మద్దతునిస్తున్నాయో.. ఆ ఊపులో తమ ఉనికిని తెలుపుకుంటున్నాయో కానీ రైతులకు భరోసానిస్తున్నాయి. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రైతులకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి హాజరై మద్దతునివ్వడమే.

 

 

ఇసుక కొరతపై గుంటూరులో ఓరోజు దీక్ష చేసిన నారా వారబ్బాయి లోకేశ్ రైతుల ఆందోళనలో మాత్రం కనపడటం లేదు. కానీ భువనేశ్వరి మాత్రం హాజరయ్యారు. ఆమె తన చేతి గాజును రైతుల ఉద్యామానికి విరాళంగా అక్కడి వారి చేత శెభాష్ అనిపించుకున్నారు. కానీ.. లోకేశ్ ఎందుకు రావడం లేదో వారు చెప్పనూ లేదు.. గ్రామాల రైతులు అడగనూ లేదు. అంబటి అడిగినట్టు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో దాదాపు ముప్పై మంది చనిపోయిన ఘటనకు సంబంధించి భువనేశ్వరి నాడు స్పందించలేదన్నదీ నిజం. ఏ మహిళలైతే చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో ఓట్లు వేయలేదో.. ఆ మహిళల ఆదరణ కోసమే చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరిని రంగంలోకి దించారనే విమర్శలు వస్తున్నాయి.

 

 

రైతులకు తమ కుటుంబం అండగా ఉంటుందని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్న చంద్రబాబు తనయుడు లోకేశ్ ఈ వ్యవహారంలో రైతులకు ఇంతవరకే ఎందుకు అండగా నిలవలేకపోయారనేది చెప్పడం లేదు. ఇక కొన్ని పత్రికల్లో అయితే ఇదే విషయాన్ని పేజీలకు పేజీలు నింపేస్తున్నారు కూడా. మొత్తంగా రాజధానిని ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం ఆపనని చంద్రబాబు అంటున్నారు. రాజధానిని  పూర్తిగా ఇక్కడి నుంచి తరలించమని ప్రభుత్వం చెప్తున్నా టీడీపీ హడావిడి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: