2020 వ సంవత్సరం వచ్చింది.  ప్రతి ఒక్కరు ఒక్కోరకమైన టార్గెట్ పెట్టుకుంటారు.  టార్గెట్ రీచ్ కావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు.  ఈ ప్రయత్నాలు ఒక్కోసారి విఫలం కావొచ్చు లేదా ఇబ్బందులు పడొచ్చు.  విఫలం అయినపుడు ఎలా విఫలం అయ్యాయో తెలుసుకోవడం ముఖ్యం.  అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా పెట్టుకునే టార్గెట్ లు ప్రతి ఒక్కరు రీచ్ అవుతారా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి.  


ఎందుకంటే అనుకున్నట్టుగా చాలామంది పెర్ఫర్మ్ చేయలేరు.  ఒకవేళ చేసినా దానికి తగిన విధంగా ముందుకు సాగిపోలేరు.  ఆ విషయాలు అందరికి తెలిసే ఉంటాయి.  ఇక ఇదిలా ఉంటె, పొలిటికల్ గా కూడా కొంతమంది టార్గెట్ లు ఉంటాయి.  ఇందులో ఒకనాటి సినీనటి, ఈనాటి ఎమ్మెల్యే రోజాకు కూడా టార్గెట్ పెట్టుకున్నది.  ఈ టార్గెట్ కోసం కష్టపడుతున్నది.  ఎవరైనా సరే ఒక స్థాయికి చేరుకోవాలి అంటే తప్పకుండా కష్టపడాలి.  కష్టపడకుండా ఏదీ కూడా సాధ్యం కాదు.  సాధ్యం అయ్యేలా చూసుకోవాలి అంతే.  


సాధ్యం చేయడానికి కావాల్సిన విధమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి.  అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు.  అలా సాధించే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే దానిని దాటుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.  ఇక ఇదిలా ఉంటె, రోజా ఈ ఏడాది చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నది.  అదేంటి అన్నది మాత్రం బయటకు చెప్పకపోయినా... ఇంకా ఏదో కావాలి అని చెప్పకనే చెప్పింది.  


రోజా చెప్పిన వ్యవహారం బట్టి చూస్తుంటే... తనకు మంత్రి పదవి కావాలి అన్నట్టుగా ఉన్నది.  మంత్రి పదవి అన్నది జగన్ చేతుల్లో ఉన్నది.  రోజాకు గెలిచిన తరువాత మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.  కానీ, సమీకరణాల వలన ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.  2021లో ఆమెకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది.  ప్రస్తుతం రోజా ఏపీఐఐసి కి చైర్మన్ గా ఉన్నది.  చైర్మన్ గా ఉన్న రోజాకు ఆమె కోరిక ప్రకారం మంత్రి పదవి దక్కాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: