రాజధాని అమరావతిని మార్చొద్దంటూ ఆ ప్రాంతంలోని రైతులు 16 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే రాజధాని మార్చొద్దనే ఆందోళన ప్రజా ఉద్యమంగా మారడం లేదు. కేవలం ఆ 29 గ్రామాల్లో తప్పితే ఎక్కడా పెద్దగా ఉద్యమ ప్రభావం లేదు. మహా అయితే టీడీపీ నేతలు చేస్తున్న ర్యాలీలు అక్కడో ఇక్కడో ఒకటీ అరా కనిపిస్తున్నాయి. మిగిలిన వర్గాలకు ఈ ఉద్యమం ఏమాత్రం పట్టడం లేదు.

 

అసలు రాజధాని అంశంతోనే కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేవలం ఓ సామాజిక వర్గం కోసమే చంద్రబాబు అక్కడ రాజధాని నిర్మించాలనుకున్నారన్న ఆరోపణలు వైసీపీ బలంగా చేసింది. వాటిని జనం కూడా నమ్మినట్టే కనిపించారు. అయితే అవన్నీ ఆరోపణలేనని.. రాజ‌ధాని ప్రాంతం ఒక సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని ముద్రవేసి అమ‌రావ‌తిని చంపేయాల‌ని సీఎం జ‌గ‌న్ కుట్ర ప‌న్నార‌ని చంద్రబాబు. ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు.

 

అంతే కాదు.. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారి లెక్కలు కూడా చెబుతూ ఇది కేవలం కమ్మ వారి కోసం జరుగుతున్న ఉద్యమం కాదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చెప్పడానికి ఈ లెక్కలు బాగానే ఉంటాయి. కానీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నదెవరు.. ఆందోళనల్లో పాల్గొంటున్నదెవరు.. దీనికి మద్దతు ఇస్తున్నదెవరు.. ఇలాంటి విషయాలు నిశితంగా పరిశీలిస్తే ఈ కమ్మనైన ఉద్యమం గుట్టు బయటపడక తప్పదు.

 

ఎందుకంటే... మొన్నటి చంద్రబాబు పర్యటనలో ఆయన భార్య భువనేశ్వరి బంగారు గాజులు ఇచ్చి విరాళాలు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత విరాళాలు ఇచ్చిన వారి జాబితా పరిశీలిస్తే... గద్దె రామ్మోహన్ చౌదరి, ఎన్నారై బుచ్చిబాబు చౌదరి, మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయ చౌదరి, దారపనేని చంద్రశేఖర్ చౌదరి, జీవీ ఆంజనేయులు చౌదరి.. ఇలా అంతా కమ్మ సామాజిక వర్గం వారే కనిపించారు. ఈ ఒక్కటి చాలదా ఇది 'కమ్మ'నైన ఉద్యమం అని చెప్పేందుకు అంటున్నారు ఆంధ్రప్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి: