ఇండియా... మలేషియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.  ముస్లిం దేశమైన మలేషియాలో భారతీయులు అనేకమంది ఉన్నారు.  అయితే, ఈ దేశం పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నది.  ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఐక్యరాజ్య సమితిలో ఇండియాను నిందించేందుకే సమయాన్ని పెట్టుకున్నారు.  దానికి తగినట్టుగానే డ్రామా నడిపారు.  ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది.  


ఆ తరువాత అనేక సందర్భాల్లో ఇండియాకు వ్యతిరేకంగా మలేషియా మాట్లాడింది.  దీంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై బలమైన దెబ్బ పడింది.  మలేషియా నుంచి ఎక్కువగా ఎగుమతి జరిగే వాటిల్లో పామాయిల్ ఒకటి.  వంటల్లో ఉపయోగించే ఈ నూనెను ఇండియా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది.  కోట్లాది రూపాయలు మన దేశం నుంచి మలేషియాకు వ్యాపారం జరుగుతుంది. మలేషియాకు ఇండియా అతిపెద్ద కష్టమర్.  


అయితే, ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఇండియన్ పామాయిల్ మర్చంట్ అసోసియేషన్ ఓ నిర్ణయం తీసుకుంది.  ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోకూడదు అని స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఇండియాకు వచ్చే పామాయిల్ సరఫరా ఆగిపోయింది.  


దీంతో మలేషియా దేశ ఆర్ధిక వ్యవస్థపై భారీగా దెబ్బపడింది.  భారీగా దెబ్బ పడటమే కాదు.  భారీగా కూడా ఇబ్బందులు వచ్చాయట.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మలేషియా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నది.  మరి ఈ ప్రయత్నాల నుంచి గట్టెక్కుతుందా చూడాలి.  ఇండియా దెబ్బ ఆ దేశానికీ బాగానే తగిలినట్టు ఉన్నది.  తగలకుండా ఎలా ఉంటుంది చెప్పండి.  కొద్దిలో కొద్దిగా ఆ దేశం ఇండోనేషియాకు పామాయిల్ ను సరఫరా చేస్తున్నది.  అక్కడికే ఇకపై సరఫా చేయాలని అనుకున్నట్టుగా చెప్తున్నది మలేషియా. ఒక్క ఆర్టికల్ 370 విషయంలోనే కాకుండా రీసెంట్ గా తీసుకొచ్చిన పౌరసత్వం బిల్లు విషయంలో కూడా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడింది.  అయితే, ఇండియా దీనిని తిప్పికొట్టింది.  ఇది ఇండియా అంతర్గత విషయం అని తేల్చిచెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: