1953 వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రరాష్ట్రం పొట్టి శ్రీరాముల ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన దాదాపుగా 58 రోజులపాటు ఆమరణ దీక్ష చేస్తూ వచ్చారు.  దీక్షను ప్రారంభించిన మొదటి రోజు అయన 53 కేజీల బరువు ఉన్నారు.  ఇక చనిపోయే రోజైన 58 వ రోజు అయన బరువు కేవలం 38 కేజీలే అనే నమ్మలేని విషయం.  58 రోజుల్లో దీక్షచేసి దాదాపుగా 15 కేజీల వరకు తగ్గిపోయారు.

 
దీక్షను విరమించుకోవాలని అప్పటి ప్రభుత్వాలు పొట్టి శ్రీరాములు చెప్పకపోవడం విశేషం.  అటు నెహ్రు ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా పేర్కొన్నారు.  1952 అక్టోబర్ 19 వ తేదీ నుంచి డిసెంబర్ 15 వ తేదీ వరకు 58 రోజులపాటు దీక్ష చేశారు.  1952 అక్టోబర్ 15 వ తేదీన మరణించారు.  కాగా, అయన మరణవార్త యావత్ దేశాన్ని కదిలించింది.  డిసెంబర్ 16 వ తేదీన అయన అంతిమ యాత్రను మద్రాస్ ప్రజలు పండగలా నిర్వహించారు.  అహింసను నమ్మిన మహాత్మాగాంధీ తూటాలకు బలైతే... అయన బాటను నమ్మిన పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానికి బలిఅయ్యారు అని పేర్కొన్నారు.  


పొట్టిశ్రీరాములు మరణం తరువాత మూడు రోజులకు అంటే 1952 డిసెంబర్ 19 వ తేదీన ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.  అయితే, మద్రాస్ పట్టణాన్ని మాత్రం తమిళనాడుకు కేటాయించారు.  మద్రాస్ పట్టణంతో కూడిన ఆంధ్రరాష్ట్రం కావాలని అప్పట్లో ఫైట్ జరిగింది.  దీని కోసం వాంచూ కమిటీని ఏర్పాటు చేశారు.  కాగా, 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.  కానీ, ఈ ముచ్చట కూడా మూడు సంవత్సరాలే కావడం విశేషం.  


పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు కూర్చున్న తరువాత అయన బరువును వైద్యులు కొలిచారు.  మొదటి రోజు - 53.9 కేజీలు, 10వ రోజు - 48.5 కేజీలు, 26వ రోజు - 45.8 కేజీలు, 43వ రోజు - 42.6 కేజీలు, 58వ రోజు - 38.1 కేజీలు ఉన్నారు. ఇలా బరువును కోల్పోతూ వచ్చారు.  పొట్టి శ్రీరాములు కంటే ముందు ఆంధ్రరాష్ట్రం కోసం దీక్షలు చేశారు.  1951 వ సంవత్సరంలో స్వామీ సీతారాం గుంటూరులోని తన ఆశ్రమంలో 1951 అగస్ట్ 16 వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 వ తేదీ వరకు దీక్ష చేశారు.  అనంతరం అయన ఢిల్లీలో దీక్ష చేపట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: