తెలంగాణ ముఖ్యమంత్రి నోట వచ్చే మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎప్పుడు చూడు బొంద పెడతా, అది బొందల గడ్ద అంటూ అచ్చమైన తెలంగాణ యాసను బాషను వాడుతూ తన మాటల తూటాలతో ప్రత్యర్ధులను నిదురపోకుండ చేయడంలో ఆయనకు ఆయనే సాటి.. ఇకపొతే ఇప్పుడు కేసీయార్ ప్రగతి భవన్ లో మాజీ డీజీపీ హెచ్ జే దొర బయోగ్రాఫీ తో ముద్రించిన జర్నీ త్రూ టర్బోలెంట్ టైమ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ పలు కీలక విషయాల్ని వెల్లడించారు.

 

 

అవేమంటే కర్తవ్య నిర్వహణలో బాగంగా మనిషిని కాపాడటం అనే విషయంలో కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని, అది అవసరమని అన్నారు. ఇప్పుడున్న సమాజంలో మనుషులు మృగాలుగా మారుతు, తమలో నేర ప్రవృత్తిని రోజు రోజుకు వృద్ది చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యా విధానం చేయడం వల్ల కొంతవరకు ఇలాంటి దుర్గటనలు అరికట్టవచ్చని తెలిపారు. ఇకపోతే తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

 

 

ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 

 

ఇక మాజీ డీజీపీ హెచ్‌జే దొర తన హయాంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ.. ఇతర పోలీసు అధికారులకు స్పూర్తినిచ్చేలా రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ, సందర్భంగా పుస్తక రచయితను, ప్రచురణ కర్తలను ముఖ్యమంత్రి కేసీయార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పలువురు మాజీ డీజీపీలు తదితరులు పాల్గొన్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: