అమరావతిలోని రాజధానిని కొనసాగించాలంటూ ముందుగా రైతులు మొదలుపెట్టిన ఆందోళన కాస్తా ప్రజా ఉద్యమంగా మారింది. అమరావతి పరిసర ప్రాంతాల్లోని 29 గ్రామాల్లో ప్రజలు రోడ్డెక్కి మరి అమరావతి కి మద్దతుగా పోరాటం ఏం చేస్తున్నారు. ముందుగా ఇది పెద్ద విషయం కాదు అన్నట్టుగా వైసిపి లైట్ తీసుకున్నా ఆ తరువాత వివిధ రాజకీయ పార్టీల మద్దతుతో ఈ ఆందోళన మరింత ఉద్ధృతం అయింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ మరింత మంట రాజేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమరావతి ప్రాంతంలో 17 రోజులుగా ఆందోళన జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తుళ్లూరు లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి (జీఈసీ) గా ఏర్పడి అమరావతి విషయంలో ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.

 


 దీనిలో భాగంగానే నేటి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. నిత్యావసరాలు ఎమర్జెన్సీ మినహా మిగతా అన్ని కార్యాలయాలు మూసివేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారు. అలాగే ఈ రోజు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం ఉండడంతో సకల జనుల సమ్మెతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని రైతులు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కారుణ్య మరణాలకు తమకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కు,  సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల కు లేఖలు కూడా రాశారు. దీని ద్వారా అమరావతి వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లి సంచలనం  సృష్టించాలని చూస్తున్నారు. 

 


అలాగే ఈ రోజు బోస్టన్ కాన్సెల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉండడంతో ఈ సకల జనుల సమ్మెను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి అనుగుణంగానే తమ నివేదికను ఇవ్వబోతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ నిరసనను గట్టిగా చూపించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా చూపించి విశాఖను రాజధానిగా చేయాలని అని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఆందోళనలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: