తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పీకల్లోతు ఇరుక్కున్నట్లే అనిపిస్తోంది. ఈయనతో పాటు ఆయన సంస్ధ ట్రాన్స్ ట్రాయ్ సంస్ధపై  మొన్ననే సిబిఐ కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఇడి) కూడా ఫెమా చట్టంలోని సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయటం సంచలనంగా మారింది.

 

రాయపాటి తో పాటు ఆయన కొడుకు రాయపాటి రామారావుపైన కూడా కేసులు నమోదయ్యాయి. అంటే ఒకవైపు సిబిఐ కేసులుండగానే తాజాగా ఇడి కూడా కేసులు నమోదు చేసినట్లైంది. వివిధ కాంట్రాక్టు పనుల కోసమని 15 బ్యాంకుల నుండి  రూ. 8832 కోట్లు అప్పులు తీసుకున్నారు. అయితే ఇందులో సుమారు రూ.  3822 కోట్లు దారిమళ్ళించినట్లుగా ఇడి గుర్తించింది.

 

దారిమళ్ళిన కోట్ల రూపాయలంతా సింగపూర్, మలేషియా, రష్యాల్లోని వివిధ బ్యాంకులకు చేరవేసినట్లు గుర్తించింది. అందుకనే ఫెమా చట్టం క్రింద తండ్రి, కొడుకులపై కేసులు నమోదు చేసింది.  నిజానికి ఈ కంపెనీకి భారీ ప్రాజెక్టులు చేసేంత సీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పోలవరంలోని దాదాపు 4 వేల కోట్ల రూపాయలు విలువ చేసే హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ కాంట్రాక్టును రాయపాటి కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ కు ఇచ్చారు.

 

తనకు దక్కిన పనుల్లోని రూ. 250 కోట్లను ముడుపులుగా రాయపాటి ఓ ముఖ్యనేతకు చెల్లించినట్లు  సిబిఐ గుర్తించింది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు ఎగొట్టటానికి సహకరించినందుకు, నిబంధనలకు విరుద్ధంగా వేరే బ్యాంకు ఖాతాలో కాంట్రాక్టు తాలుకు బిల్లులు చెల్లించిన కారణంగానే ముఖ్యనేతకు రాయపాటి ముడుపులు  చెల్లించినట్లు సిబిఐ గుర్తించటమే సంచలనంగా మారింది. చూస్తుంటే తండ్రి, కొడుకుల అరెస్టు మాత్రమే మిగిలినట్లు అనిపిస్తోంది. అదే జరిగితే ముడుపులు అందుకున్న ఆ ముఖ్యనేత ఎవరనే వి
యం బయటపడుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: