రాజధానిగా  అమరావతిని కంటిన్యు చేయటానికి కుట్రలు జరుగుతున్నాయా ?  కొందరు రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తు కొన్ని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవటానికి వ్యూహాలు పన్నుతున్నాయా ? ఈ ప్రశ్నలకు  సమాధానం అవుననే అంటున్నాయి రెండు రాజకీయపార్టీలు. రాజధాని డిమాండ్ తో రైతుల ఆత్మహత్యలు చేసుకోబోతున్నారనే ప్రచారమే సంచలనంగా మారింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మూడు రాజధదానుల ప్రకటనను జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం తెలిసిందే. జగన్ ప్రకటన ప్రకారం రాజధానిగా అమరావతి స్ధానంలో విశాఖపట్నం మారబోతోంది. దాంతో రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు వీల్లేదంటూ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో నానా గోల జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

సరే జరుగుతున్న ఆందోళనలో ఎక్కువభాగం పెయిడ్ ఆర్టిస్టులే అని, పెయిడ్ ఆందోళనలే అనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనలు ఇలా ఉండగానే  కొందరు రైతులు  ఆత్మహత్యలు చేసుకోవటానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖలు రాయటమే విచిత్రంగా ఉంది. నిజానికి ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకునే ఎవరూ పర్మిషన్ కావాలని ఎవరినీ అడగరు.

 

ఈ విషయం ఇలా ఉండగానే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో రాజధాని గ్రామాల్లో గందరగోళం మొదలైంది. నిజానికి రైతు ఆత్మహత్యకు రాజధాని ఆందోళనలకు ఏమీ సంబంధం లేదని సమాచారం. అయితే చంద్రబాబునాయుడు మాత్రం పదే పదే రైతులు మెర్సీకిల్లింగ్స్ కు అనుమతి కోరారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు చెప్పాల్సిన చంద్రబాబు పదే పదే ఆత్మహత్యలను ప్రోత్సహించేట్లుగా మాట్లాడటమేంటో అర్ధం కావటం లేదు.

 

ఇదే విషయమై వైసిపి, బిజెపి నేతలు మాట్లాడుతూ కొందరు రైతులను హత్యలు చేసేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్రలు జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మరికొందరు రైతులను ఆత్మహత్యలు చేసుకునేట్లుగా టిడిపి ప్రోత్సహిస్తోందంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతిని కూడా  చంద్రబాబు మానసికంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు రైతుల ఆత్మహత్యల డిమాండ్ కు కుట్ర మొదలుపెట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా బలైపోయేది మాత్రం అమాయకులే అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: