అత్తతో పోల్చుకుంటే కోడలే చాలా తెలివైనదని తేలిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత చాలామందిలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలనే డిమాండ్ తో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు, మహిళలకు మద్దతుగా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా దీక్షలో కూర్చున్నారు. పైగా ఉద్యమ ఖర్చుల కోసం తన చేతి గాజులను భువనేశ్వరి ఇవ్వటమే వివాదాస్పందంగా మారింది.

 

మహిళలు పడుతున్న బాధలను చూసి చలించిపోయే తాను ఉద్యమానికి మద్దతుగా తన గాజులను ఇచ్చినట్లు భువనేశ్వరి ప్రకటించారు. దాంతో  ఇటు వైసిపి అటు బిజెపి నేతలు ఆమెను ఓ ఆటాడుకుంటున్నాయి. గడచిన ఐదేళ్ళలో మహిళలు పడిన బాధలు పడినపుడు మనసు ఎందుకు చలించలేదంటూ పై పార్టీలు భువనేశ్వరిని నిలదీస్తున్నాయి.  వైసిపి, బిజెపి నేతల ప్రశ్నలకు చంద్రబాబు దంపతులు సమాధానాలు చెప్పుకోలేక నానా అవస్తలు పడుతున్నారు.

 

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై నారాబ్రాహ్మణి  కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి భువనేశ్వరి కన్నా బ్రాహ్మణిపైనే బాధ్యత ఎక్కువగా ఉంది. ఎందుకంటే తన భర్త లోకేష్ మంగళగిరిలో పోటి చేసి ఓడిపోయారు. లోకేష్ ను  గెలిపించమంటూ బ్రాహ్మణి నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

సరే ఎవరెంత ప్రయత్నం చేసినా లోకేష్ ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి.  ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం వైపు చూడాల్సిన బాధ్యత ప్రచారం చేసిన వాళ్ళపై ఉండదు. కానీ చంద్రబాబు కోడలిగా లోకేష్ భార్యగా బ్రాహ్మణి కేసు వేరు. పైగా ఇపుడు ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో  మద్దతు తెలపటం ఆమె నైతిక బాధ్యత.

 

అయినా ఇటువైపు కనీసం తొంగికూడా చూడలేదంటే జనాల నోట్లో నాన కూడదనే అని అర్ధమైపోతోంది.  భువనేశ్వరి కూడా ఏదో సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిద్దామనే అనుకున్నది. కానీ అదికాస్త రివర్సయ్యింది. ఈ విషయాన్ని ముందుగా ఊహించే బ్రాహ్మణి ఆందోళనల వైపు చూడలేదని అనుమానం వ్యక్తమవుతోంది.  ఇందుకనే  అత్తగారి కన్నా కోడలే తెలివైందని జనాలు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: