మాజీ ఎంపీ టిడిపి నాయకుడు రాయపాటి సాంబశివరావు ఇప్పుడు సిబిఐ కేసులు అవుతున్నారు. వివిధ బ్యాంకుల నుంచి రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని వాటిని కట్టకుండా ఎగవేసే నేపథ్యంలో బ్యాంకు అధికారులకు ఫిర్యాదు మేరకు సిబిఐ రాయపాటి పై కేసు నమోదు చేసింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ లావాదేవీలపై సిబిఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టింది ఇప్పటికే గుంటూరు, కర్ణాటక, హైదరాబాదులో రాయపాటికి చేయండిన వివిధ కంపెనీలు, ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన సిబిఐ అధికారులు అందులో కీలకమైన ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. 2013లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ట్రాన్స్ ట్రాయ్ ఆ తరువాత వాటిని చెల్లించకుండా బ్యాంకులకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో బ్యాంకు అధికారులు సి.బి.ఐ ఫిర్యాదు చేశారు.


 ఈ నేపథ్యంలోనే సీబీఐ రాయపాటి పై కేసు నమోదు చేసుకుంది. అయితే సీబీఐ కేసుతో ఉలిక్కిపడ్డ రాయపాటి అసలు సిబిఐ దాడులు సమయంలో తనకు ట్రాన్స్ ట్రాయ్ కు సంబంధం లేదని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. రాజకీయ కారణాలతో ట్రాన్స్ ట్రాయ్ కు తాను దూరంగా ఉంటున్నానని ఆ మొత్తం వ్యవహారాలను ఎండి చెరుకూరి శ్రీధర్ మాత్రమే చూస్తున్నారని రాయచోటి వివరణ ఇచ్చారు. ఇక కెనరా బ్యాంక్ ఈ సంస్థకు 990 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. ఆ రుణం తిరిగి చెల్లించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమవడంతో నే సి.బి.ఐ ఫిర్యాదు చేసింది.


  ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి రాయపాటి సాంబశివరావు డైరెక్టర్ ప్రమోటర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పై కేసు నమోదయింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు రాయపాటి ఆర్థిక లావాదేవీల గురించి పెద్ద ఎత్తున సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2013లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవరం హెడ్  రెగ్యులేటరీ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేసే నిమిత్తం 14 బ్యాంకుల కన్సార్టియమ్ వద్ద వివిధ దశల్లో 8830 కోట్ల వరకు రుణాలుగా తీసుకున్నారు. 


ఈ 14 జాతీయ బ్యాంకుల కన్సార్టియమ్ ద్వారా  995 కోట్ల వరకు అప్పు ఇచ్చిన కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకు గా ఉంది. తమ నుంచి నిధులను రుణాలుగా తీసుకున్నా తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తూ వస్తుండడంతో 2015 నుంచి బ్యాంకుల కన్సార్టియమ్ రుణాల రికవరీ కి ప్రయత్నించింది. అయినా వసూలు కాకపోవడంతో 2018లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేసింది. తమ నుంచి తీసుకున్న రుణాల్లో 264 కోట్లను వేరే ఖాతాకు మళ్లించారని యూనియన్ బ్యాంక్ ఆరోపణలపై సి.బి.ఐ కేసు నమోదు చేసింది. వాస్తవానికి కి ట్రాన్స్ట్రాయ్ సంస్థ 14 బ్యాంకుల్లో రుణాలను ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో రైల్ వే, ఆయిల్ గ్యాస్, ప్రాజెక్టులు చేపడతామని చెప్పి రుణాలు పొందింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో రాయపాటి నిండా మునిగినట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: