రాజధాని ప్రాంతంలో తెలుగుదేశంపార్టీ నేతలు చెబుతున్నట్లు తనకు భూమి ఉందని నిరూపిస్తే తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సవాలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసిపి-టిడిపి నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు టిడిపిలోని కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు 4075 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు లబ్ది పొందరని వైసిపి నేతలు తాజాగా చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.

 

వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలకు టిడిపి మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్లో భాగంగా వైసిపిలోని అనేక మంది నేతలు కూడా ఇణ్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు చేసిన ఆరోపణల్లో  మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. బోండా మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో తన భార్య పేరుతో ఆళ్ళ 5 ఎకరాలు కొన్నట్లు ఆరోపించారు.

 

ఆ విషయాన్ని ఆర్కె మీడియాలో మాట్లాడుతూ తనకు నీరుకొండ గ్రామంలో 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే తాను ఎంఎల్ఏగా రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరారు. మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటింన విషయాన్ని ఆర్కె గుర్తుచేశారు.  టిడిపి చెబుతున్నట్లుగా తనకు అక్కడ భూమి ఉంటే వాళ్ళు చెప్పిన పేరు మీద రిజిస్టర్ చేసేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

 

అంతే కాకుండా స్పీకర్ ఫార్మాట్ లో  రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెబుతానని కూడా ఆర్కె చెప్పారు. ఏదో కాగితాలు పట్టుకుని తనకు భూములున్నాయని బోండా చెబితే తాను చేయగలిగేది ఏమీ లేదన్నారు. టిడిపిలోని నేతలు చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వివరాలు బయటకు వచ్చాయన్న కోపంతో తనపై అసత్యాలతో ఆరోపణలు చేయటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండదని ఆళ్ళ హెచ్చరించారు. మరి ఆర్కె సవాలును టిడిపి స్వీకరిస్తుందో లేదో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: