మూడు రాజధానులు అంశంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రేంజ్ లో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంతోపాటు దీనిపై ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలనే ఆలోచన వచ్చింది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, బంధువులు పేరుమీద భారీగా భూములు కొనుగోలు చేసారని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. రాజధాని ప్రకటన కంటే ముందే అంటే 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు భూముల కొనుగోలులో పెద్ద గోల్ మాల్ జరిగిందని టీడీపీకి సంబంధించిన వారు భారీగా భూములు కొన్నట్టు వైసిపి పేర్కొంది. భూములు కొనుగోలు మొత్తం పూర్తయిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారని, ఆ తరువాత ఆ భూములను తపిస్తూ సి ఆర్ డి ఏ అలైన్మెంట్ మార్చారని వైసీపీ వాదిస్తోంది.


 రింగ్ రోడ్డును ఇష్టానుసారంగా మార్చారని విమర్శించారు వైసీపీ నాయకులు. మొత్తం 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వీడియో లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి అండదండగా నిలిచిన కొంతమంది అధికారులు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భారీగా లబ్ధి పొందారంటూ  వీడియో లో ఆరోపించారు. టిడిపి సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ తన కుటుంబ సభ్యుల పేర్ల పై 15.30 ఎకరాల ఎకరాల భూమిని కొన్నారని, పల్లె రఘునాథ్ రెడ్డి 7.5 ఎకరాలు, అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై టిడిపి నేత కొమ్మలపాటి శ్రీధర్ 28.6 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు

 

 అలాగే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు ఆధ్వర్యంలో నడుస్తున్న  ఆర్ ఆర్ ఇన్ ఫ్రా అవెన్యూస్ పేరుతో భూములు కొనుగోలు చేశారని వివరించారు. యనమల రామకృష్ణుడు అల్లుడు మహేష్ యాదవ్ ఏడు ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే స్పీకర్ కోడెల శివప్రసాద్ 17.3 ఎకరాలు, గుమ్మడి సురేష్ పేరు పై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు 38.8 నాలుగు ఎకరాలు, మాజీ ఎమ్యెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవి, దేవరపు పుల్లయ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేసినట్లు వీడియో లో పేర్కొన్నారు. ఇంకా అనేక మంది పేర్లతో వైసిపి విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: