మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) విచారిస్తుండగా , ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి, గత నెల  హైకోర్టును ఆశ్రయించగా,  నేడు హైకోర్టు ఈ కేసును విచారించనుంది . వివేకా హత్య కేసు దర్యాప్తు ను కొనసాగించాలని  హైకోర్టు సిట్ నే ఆదేశిస్తుందా ?, లేకపోతే సిబిఐ కి అప్పగిస్తుందా  ?? అన్నది హాట్ టాఫిక్ గా మారింది . ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది .

 

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్న పరమేశ్వర్ రెడ్డి , హత్య జరిగిన రోజు కడప పట్టణం లోని హరిత హోటల్ లో బస చేసిన బిటెక్ రవిని కలుసుకున్నట్లుగా భావిస్తున్నారు . ఈ మేరకు హోటల్ సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా , హోటల్ మేనేజర్ ను సైతం ప్రశ్నించారు . వివేకా హత్య కేసులో ఇప్పటికే బిటెక్ రవిని  సిట్ అధికారులు ప్రశ్నించారు .  సిట్ అధికారులు విచారించిన తరువాత , వివేకా హత్య కేసు దర్యాప్తు  నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐ కి అప్పగించాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆయన ఆశ్రయించారు .

 

దీనితో సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని బిటెక్ రవి చెప్పకనే చెప్పినట్లయింది . సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో పని చేస్తుండడం వల్లే అయన , సిబిఐ  దర్యాప్తు కోరి ఉంటారనేది నిర్వివాదాంశమే . రాష్ట్రం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండడంతో , సిట్ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని టీడీపీ నాయకులు భావిస్తున్నారు . అందుకే వివేకా హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగి , హంతకులెవరో తేలాలంటే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతున్నారు . చూడాలి మరి రాష్ట్ర హైకోర్టు ఏమి చెబుతుందో . 

మరింత సమాచారం తెలుసుకోండి: