అమరావతి ప్రాంతంలో రాజధాని వ్యవహారంపై జరుగుతున్న రాద్ధాంతంలో అధికార పార్టీ వైసీపీపై తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై అమరావతి లోని 29 గ్రామాలలోని కొంతమంది ప్రజలు తప్ప మిగతా ప్రాంతాల్లో అనూహ్యమైన మద్దతు లభించడంతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. మిగతా ప్రాంతాల్లోని తెలుగుదేశం నాయకుల ద్వారా జగన్ నిర్ణయానికి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు అన్నట్టుగా నిరసనలు ఆందోళనలు చేయిస్తూ హడావుడి చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారనే ఆరోపణలు ప్రజలు కార్యకర్తల్లో తీవ్రంగా నెలకొంది. ఈ నేపథ్యంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై  రాజధాని వ్యవహారంలో రైతులకు నచ్చజెప్పి, జగన్ నిర్ణయాన్ని వారికి అర్థం అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు అంటూ ఆమె ఫ్లెక్సీలను చించివేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది ప్రభుత్వం మద్దతు దారులు ఆందోళన నిర్వహించారు. జగన్ ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో మా ఎమ్మెల్యే విఫలమైనట్టుగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా మెరుగ్గా వ్యవహరిస్తున్నారని, జగన్ నిర్ణయాన్నిప్రజలకు రైతులకు వివరించి వారి మద్దతు పొందేలా వ్యవహరించడంతో పాటు అప్పటి టిడిపి ప్రభుత్వంలో అమరావతిని ప్రకటించిన సందర్భంగా అంతకుముందు ఎవరెవరు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశాఋ అనే విషయాన్ని ధైర్యంగా రామకృష్ణారెడ్డి బయటపెట్టి వైసిపి ప్రభుత్వానికి ప్రజల లో మద్దతు పెరిగేలా చేస్తున్నారంటూ ఆయనను ప్రశంసిస్తూ ఉండవల్లి శ్రీదేవి వ్యవహారంపై మండిపడుతున్నారు. 


గతంలో ఉండవల్లి శ్రీదేవి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తనకు క్రిస్టియన్ అంటూ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె ఈ కేసు విచారణను ఎదుర్కుంటుండగా ఇప్పుడు ఆమె చుట్టూ ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: