ఏపీలో రాజధానిలో ఏర్పాటు అమరావతి  పరిస్థితిపై బోస్టన్ కమిటీ నివేదికను ఈ రోజు సీఎం జగన్ కు అందించబోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కమిటీ ఇచ్చే నివేదికపై అందరిలోనూ ఆసక్తి నెల నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేక మరో ప్రాంతానికి మారుతుందా ? అలాగే ప్రభుత్వం చెబుతున్నట్టుగా మూడు ప్రాంతాలను రాజధానులుగా సమర్థిస్తూ కమిటీ నివేదిక ఇస్తుందా అనే అంశంపై అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. రాజధాని విషయంపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ అనేక సూచనలు చేస్తూ తమ నివేదికను అందించింది. ఈ నేపథ్యంలో బోస్టన్ కమిటీ   ఇచ్చే నివేదికను 8వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారా లేక ముందుగానే నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 


ఇప్పటికే అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించడంపై పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జగన్ నిర్ణయానికి ప్రజలు జై కొడుతున్నారు. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో బోస్టన్ కమిటీ ఏ విధంగా తమ నివేదికను ఇస్తుందనే ఆశక్తి అందరిలోనూ ఉంది. జీఎన్ రావు ,బోస్టన్ కమిటీ నివేదికలపై ఇప్పటికే జగన్ హైపవర్ కమిటీని నియమించడంతో ఈ రెండు రిపోర్టులను హై పవర్ కమిటీ పరిశీలించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుంది. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధి, వికేంద్రీకరణ పైన పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఆ తరువాత అనేక సూచనలు చేసి జనవరి 20వ తేదీలోగా నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.


 ఈ మూడు కమిటీల సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ తో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏవిధంగా ఉంటుంది అనే విషయంపైనా ఇలా అందరిలోనూ టెన్షన్ కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ కమిటీ ఇచ్చే నివేదికపై ఈ రోజు ఏ ప్రకటన చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: