రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అక్రమ సంబంధాల నెపంతో హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అన్యోన్యంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలు మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్  అవడంతో ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి సమస్య ఎదురైంది. ప్రియుడితో కలసి మంచం మీద రాసలీలలు సాగిస్తున్న భార్య... భర్త కు రెడ్ హ్యాండెడ్ గా  దొరికిపోయింది. కానీ తన సుఖానికి భర్త  అడ్డం వచ్చాడు అని కోపంతో ఊగిపోయిన భార్య ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది భర్తను చంపి ఒక సంచిలో మూటగట్టి రోడ్డు పక్కన పడేసింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలోని మునిగుడుకు  ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

 


 వివరాల్లోకి వెళితే... నూతన సంవత్సరం రోజున  అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ మహిళ మాత్రం భర్తలేని సమయం తో ప్రియుడితో బాగా ఎంజాయ్ చేసింది. ఒడిశాలోని రాయగడ జిల్లా మునిగోడుగు చెందిన రాజ్ కుమార్ నివేదిత భార్య భర్తలు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నివేదిత మునిగోడుకు తహసిల్దార్ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తుంది. రాజ్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటారు. అయితే భార్య నివేదిత భర్త కళ్లుగప్పి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. డిసెంబర్ 31న రాత్రి రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన భర్త రాజ్ కుమార్ కు భార్య మరో వ్యక్తితో మంచంపై అసభ్యకర రీతిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్య పై చేయి చేసుకున్నాడు. 

 


 ఇంకేముంది తన సుఖానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది భార్య నివేదిత. ప్రియుడితో కలిసి రోకలిబండతో భర్త తలపై బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావం అయిన రాజ్ కుమార్  అక్కడికక్కడే చనిపోవడంతో మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా గజపతి జిల్లా లోని ఒడవ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసింది. ఎవరికీ అనుమానం రాకుండా మునిగడప పోలీస్ స్టేషన్ కు  వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య నివేదిత. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టిన ఓడవా  ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం లభించిన స్థలంలో కొన్ని ఆధారాలను బట్టి నివేదితను  అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో భార్య నివేదిత సహా ఆమె ప్రియుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: