భోపాల్ లో ఘోరమైన సంఘటన చోటుచేసుకొని కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన ప్రకారం 13 ఏళ్ల అమ్మాయి భోపాల్ లోని నిషాట్పురా ప్రాంతంలో తన అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటుంది. ఒకరోజు తన అమ్మమ్మతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్ళిపోయి హనుమంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బస్టాండ్ వద్దకు వెళ్లి నిల్చుంది. అప్పుడు ఆ అమ్మాయి వద్దకు అభయ్ అనే ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆ బాలికను ఆటోలో ఎక్కించుకొని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో గంజాయి బలవంతంగా తాగించాడు.


దాంతో ఆమెకు బాగా మత్తెకెక్కింది. అదే అదునుగా భావించిన అభయ్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆమెకు తరచుగా గంజాయి మాదకద్రవ్యం ఇస్తుండేవాడు అభయ్. ప్రతిరోజూ గంజాయి తాగడం వల్ల ఆ బాలిక దానికి బానిసైపోయింది. ఇదే సద్వినియోగం చేసుకోవాలనుకున్న అభయ్.. 'ఇప్పటినుండి నీకు గంజాయి కావాలంటే నా ఫ్రెండ్స్ తో కూడా నువ్వు సెక్స్ చేయాలి'అని ఆమెతో చెప్పాడు. దానికి ఒప్పుకొని ఆ బాలిక కొన్ని రోజుల వరకు గంజాయి లేకుండానే ఉంది. కానీ ఆమె దానికి బాగా బానిసై ఉండటంతో ఎక్కవరోజుల ఉండలేక అభయ్ ని గంజాయి కోసం మళ్ళీ అడిగింది. అప్పుడు అభయ్ తన తోటి ఆటోడ్రైవర్ల గంజాయి ఇస్తారని చెప్పి బాలికను వాళ్లకు అప్పగించాడు. దాంతో, వాళ్లు కూడా ఆమెపై తమ కామవాంఛను తీర్చుకున్నారు. అలా గత ఆరు నెలలుగా గంజాయి ఇస్తామని బాలిక బలహీనతను యూజ్ చేసుకుంటూ ఆమెపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు ఆటోడ్రైవర్లు.


ఒకానొక సందర్భంలో గంజాయిని బాలికకు ఏ ఆటోడ్రైవర్ ఇవ్వకపోవడంతో... ఆమె ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. దాంతో బాలిక నాన్నకు విషయం తెలియజేసింది అమ్మమ్మ. అప్పుడు బాలిక నాన్న ఆమెను జిల్లా చైల్డ్ లైన్ కేంద్రానికి తీసుకెళ్లాడు.


అప్పుడు అక్కడి అధికారులు బాలికకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఆమె తనకు జరిగిందంతా చెప్పడంతో వాళ్లు కంగుతిన్నారు. వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను ఆశ్రయించి ఆరా తీయగా ఆమె అభయ్, ఇంకా కొంతమంది తనని రేప్ చేసారని చెప్పింది. దాంతో అభయ్, మిగతా ఆటోడ్రైవర్ల పై ఐపీసీ సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం ప్రధాన నిందితుడిని పట్టుకొని వాడితో మిగతా డ్రైవర్ల వివరాలని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ బాలికను మినహాయించి మరొక 16ఏళ్ల అమ్మాయికి గంజాయి అలవాటు చేసి ఆమెపై కూడా అభయ్ అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. సో, ఆ 16ఏళ్ల అమ్మాయి కోసం కూడా వెతుకుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: