మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేసాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ క్రేజీవాల్ తమకు ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని బిజెపి చాలా కాలంగా ఆగ్రహంగా ఉంది. అందుకే ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఇబ్బందులు పెడుతోంది. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ముందుకు వెళుతోంది తప్ప ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య ఈ విధమైన వాతావరణం వాతావరణం కొనసాగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి వినూత్న రీతిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం బాగా వైరల్ అయింది.


 ఆ విషెస్ కూడా బీజేపీకి సెటైర్లు వేస్తూ చెప్పడమే ఈ విషయాన్ని వార్తల్లో నిలిచేలా చేసింది.బిజెపిలో ఏడుగురు ముఖ్యమంత్రులు ఉన్నారని వారందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ లో విషెస్ చెప్పింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ ను ఏర్పాటు చేసి అందులో గౌతమ్ గంభీర్, మనోజ్ తివారి, విజయ్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, హర్షవర్ధన్, విజేందర్ గుప్తా, ఫర్వేస్ సింగ్ పేర్లను ప్రస్తావించింది. వీరిలో ఎవరు తనపై పోటీ చేస్తారు అని ఆమ్ ఆద్మీ పేర్కొంది.


అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ప్రకటించడం వెనుక కారణాలు పరిశీలిస్తే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా బిజెపి ఇప్పటి వరకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. ఢిల్లీ బీజేపీ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ ఈ విషయంపై స్పందిస్తూ త్వరలోనే తమ పార్టీ సీఎం అభ్యర్థి పై నిర్ణయం తీసుకుంటుందని వివరణ ఇచ్చారు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించే బిజెపి ఢిల్లీ విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్ననేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ విధంగా బీజేపీని వెటకారం చేస్తూ శుభాకాంక్షలు చెబుతూ బీజేపీని మరింత నవ్వులపాలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: