వైసిపి పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉన్న సీనియర్ నేతలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. చాలా మంది వైయస్ జగన్ ని ప్యాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్ అని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేవలం ఏడు నెలలు కావస్తున్న క్రమంలో ఎంతో అద్భుతంగా జగన్ పరిపాలిస్తున్నాడు అంటూ చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా కొత్త సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేస్తూ మరియు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు వంటి సరికొత్త నిర్ణయాలు తీసుకున్న జగన్ తాజాగా మచిలీపట్నం వాసుల కలలు నెరవేర్చటానికి రెడీ అయిన నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి మచిలీపట్నం వాసులు జై కొడుతున్నారు.

 

ముఖ్యమంత్రి పీఠంలో సరైనోడు కూర్చున్నాడు ఇరగదీశాడు మాటమీద నిలబడి అధికారంలోకి వచ్చి నెరవేరుస్తున్నాడు అంటూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే మచిలీపట్నం బందరు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కి వైఎస్ జగన్ సర్కారు నడుం బిగించింది. అమరావతి-విజయవాడకు దగ్గరలోని దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా 280 కోట్లతో ప్రాథమికంగా డీపీఆర్ సిద్ధం చేయిస్తోంది. బందరు సముద్రం ఒక ద్వారం వద్ద మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అలాగే వ్యాపారులు కూడా బాగా నష్టపోతున్న నేపథ్యంలో   ఫిషింగ్ హార్బర్ కట్టేందుకు జగన్ సర్కారు రెడీ అయ్యింది.

 

బందరులో ఫిషింగ్ హార్బర్ రావటానికి ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని మరియు అదే విధంగా మోపిదేవి రమణ కీలకంగా వ్యవహరించి మచిలీపట్నం వాసుల కల నెరవేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో బందరు హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు త్వరలో పిలవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: