జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత  అమరావతి రాజధాని చుట్టూ ఎంత గోల జరుగుతోందో అందరికీ తెలిసిందే.  ఇదే విషయమై కాస్త లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నిజానికి అమరావతి అన్న పేరే ఈ ప్రాంతానికి అచ్చిరాలేదన్న విషయం  చరిత్ర చెబుతున్న సత్యం.  రాజుల కాలం నుండి తీసుకున్నా నవీన కాలం దాకా ఇదే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది.

 

తాజాగా అమరావతిని రాజధానిగా ప్రకటించేముందు టిడిపిలోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయిన విషయం బయటపడింది. అప్పట్లో అంటే ఐదేళ్ళ క్రితం ఏపికి రాజధానిగా అమరావతి పేరు చర్చకు వచ్చినపుడు టిడిపి సీనియర్ ఎంఎల్ఏ బుచ్చయ్యచౌదరి అండ్ కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. చరిత్రను పరిశీలిస్తే అసలు అమరావతి అన్న పేరే అచ్చి రాలేదని అభ్యంతరం చెప్పారట.

 

ధరణికోట అన్న పేరుతో ఉన్న రాజధానిని అమరావతిగా మార్చటంతోనే శాలివాహనుల రాజ్యం కుప్పకూలిపోయింది. అలాగే ఆ రాజ్యానికి చివరి రాజైన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని చరిత్ర చెబుతోంది. అలాగే అమరావతి అనే గ్రామంలోని పంచారామాల్లో ప్రధమారామంగా ప్రఖ్యాతి చెందిన అమరేశ్వరాలయం కూడా  దెబ్బ తినేసింది. ఆ తర్వాత రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.

 

వందల  సంవత్సరాలు అంటే 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబునాయుడు ఓటుకునోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయొచ్చారు. అప్పుడు ఏపికి కొత్త రాజధాని ఏది అనే చర్చను పెట్టి చివరకు అమరావతిని డిసైడ్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ అమరావతి ప్రాంతం రాజధాని అయ్యిందో  వెంటనే సమస్యలు మొదలయ్యాయి.

 

అమరావతి రాజధానిగా ఉన్న ఏపికి విభజన చట్టం ప్రరాకం రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ రాలేదు. వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులందలేదు. చెప్పుకోదగ్గ స్ధాయిలో పరిశ్రమలూ రాలేదు, పెట్టుబడులూ లేవు. తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని  టిడిపి ఘోరంగా ఓడిపోయింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అసలు పోటినే చేయలేదు.

 

చివరకు  2019 ఎన్నికల్లో చంద్రబాబు అత్యంత ఘోరంగా ఓడిపోయారు.  అమరావతి అనే పేరుతో రాజధాని ఏర్పడగానే వేలాది ఎకరాల పంట భూములు నాశనమైపోయాయి. సరే చంద్రబాబు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే  లక్షల కోట్ల రూపాయల అప్పులు స్వాగతం చెప్పాయి. దాంతో సెంటిమెంటుగా ఫీలయిన జగన్ కూడా అమరావతి చరిత్రను, అరిష్టాలను పరిగణలోకి తీసుకుని అసలు రాజధానిని మార్చేయాలని డిసైడ్ అయ్యారు. మరి రాజధాని మారిన తర్వాతైన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: