పుట్టేటప్పుడు మనిషిగా పుడతారు. కొన్ని నెలలు గడిచాక పుట్టిన వాడికి ఒక పేరు పెడతారు. అప్పటి నుండి ఆ పేరుతో పోయేవరకు పిలవబడతారు. కానీ పోయాక పేరుతో పిలవరు. మీ శవాన్ని ఇక్కడి నుండి తీయండని లేదా, ఆ శవాన్ని ఇంకా దహనం చేయలేదా అని గాని అంటారు. ఇక ఇక్కడున్న లాజిక్ ఏంటంటే పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాము, పోయాక ఏడిపిస్తూ పోతాం. కాని ఈ మద్యకాలంలో ఉన్న జీవితంలో మన వల్ల ఎందరో ఏడ్చేలా చేస్తాము. ఇదే జీవితం. ఇది గ్రహించక ఎన్నో గొప్ప గొప్ప పోకడలకు పోయి లోకంలో మన జీవితాలను మనమే చే జేతులారా నాశనం చేసుకుంటాము.

 

 

ఇక ఒక మనిషి మరణిస్తేనే అందరు వెళ్లి చూడలేనంత బిజీ ప్రపంచంలో బ్రతుకుతున్న మనం మన ఇంటి ముందు ఓ కుక్క చనిపోయిన చీ అని దూరం వెళ్లుతామే తప్పా అయ్యే పాపం అని జాలి పడం. ఇలాంటి లోకంలో అక్కడక్కడ మంచి మానవత్వం ఉన్న వారు కూడా ఉన్నారని ఈ సంఘటన నిరూపిస్తుంది. అవసరం ఉన్నంత వరకు వాడుకుని అవసరం తీరాక దూరంగా విసిరిగొట్టే ఈ లోకంలో తాను ప్రాణంగా పెంచుకున్న నోరు లేని మూగ జీవి ప్రాణం పోతే ఒక రైతు తన ప్రాణాలే పోయినంతగా విలవిలలాడి పోయాడు. ఈ వివరాలు తెలుసుకుంటే..

 

 

రైతు కుటుంబంలోని పశువులు వారి ఇంట్లో భాగమై ఉంటాయన్న విషయం తెలిసిందే. పాడి పశువులు.ఆవులు, ఎద్దులు, గేదెలు మొదలగు వాటిని రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా జైత్‌పూర్ పరిధిలోని ముఢారీ గ్రామంలోని బలరామ్ మిశ్రా అనే రైతు ఆవు ఓ దూడకు జన్మినిచ్చిన తరువాత చనిపోవడంతో తన బిడ్డ చనిపోయాడన్నంతగా దుఖించాడు.

 

 

అంతటితో ఊరుకోకుండా ఆ ఆవుకు సాంప్రదాయ బద్దంగా  అంత్యక్రియలు జరిపించాడు. ఇదే కాకుండా ఆవు కళేబరానికి ఎర్రటి వస్త్రాన్ని కప్పి తన బండిలో ఊరంతా తిప్పుతూ అంతిమయాత్ర నిర్వహించాడు. చివరికి వేద మంత్రాలతో ఆవుకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన  ఆ రైతు, తన ఆవు అస్తికలను పవిత్ర నదిలో కలుపుతానని చెప్పి, తనకు ఆవుపై ఉన్న ప్రేమను చాటాడు. ప్రస్తుతం ఈ రైతు చేసిన పని ప్రతి గ్రామస్తుని హృదయాన్ని కదిలించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: