భువనేశ్వరి అమరావతి వచ్చివెళ్లినప్పటినుంచీ వైసీపీనేతల వెన్నులో వణుకు మొదలైందని, జగన్‌ప్రభుత్వం కక్షసాధింపులకు బలవుతున్న రాజధాని రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు సతీమణిపై నోరుపారేసేకోవడం మానుకోవాల ని టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు.  శ్రీరాము డి వెంట సీతాదేవి వచ్చినట్లుగా, చంద్రబాబుతో పాటు భువనేశ్వరి రైతులధర్నాలో పాల్గొన్నారని, అది మొదలు రాష్ట్రమంత్రలు, ఎమ్మెల్యేలు ఆమెను లక్ష్యంగా చేసుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వెంకన్న మండిపడ్డారు. ఆమెరాక వైసీపీనేతలకు చెమటలు పట్టించిందనడానికి వారుచేస్తున్న తప్పుడు ఆరోపణలే నిదర్శనమన్నారు.

 

జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి, భారతీసిమెంట్స్‌కి చెందిన మనీలాండరింగ్‌కేసులో 5వ ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు చెందిన రూ.23కోట్లను జప్తుచేయడం జరిగిందన్నా రు. భారతిలా, భువనేశ్వరిపై ఎలాంటి కేసులు లేవని, తనకంపెనీ నుంచి బియ్యం సంచులు తయారుచేయించి, భారతిలాగా వాటిలో కమీషన్లు కాజేసినచరిత్ర, కక్కిన కూటికి ఆశపడే స్వభావం భువనేశ్వరికి లేవన్నారు. ఆడవాళ్లనుగురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదన్న ఒకేఒక్క సంస్కారంతో టీడీపీనేతలు ఆలోచిస్తున్నారన్నారు. 

 

వైసీపీ వాళ్లకు భువనేశ్వరి నిజాయితీగురించి మాట్లాడటంతప్ప, మరోమార్గం లేదన్నారు.  భారతి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా రని, వాటి గురించి మాట్లాడేధైర్యం వైసీపీనేతలకు ఉందా అని వెంకన్న ప్రశ్నించారు.     పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్న ఆళ్ల, తనపార్టీవాళ్ల భూములకొనుగోళ్లపై స్పందించాలని  , వైసీపీనేతల భూములచిట్టాతో ఆయన చర్చకువస్తే, ఏపార్టీలో ఎవరికి ఎందరు బినామీలున్నారో తేలుతుందన్నారు. కోర్టుల్లో కేసులు వేయడంద్వారా అమరావతి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగిలిన కరకట్ట కమలహాసన్‌, తనవద్ద ఉన్న ఆధారాలతో   రైతులు ముందుకు వస్తే, వారిమధ్యనే చర్చిద్దామని వెంకన్న సవాల్‌ విసిరారు.

 


జగన్‌లా ఊరికొక ఇల్లు కట్టుకోవడం, చంద్రబాబుకి తెలియదని, ఆయనకు తెలిసింద ల్లా ప్రజల సంక్షేమమేనన్నారు. తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు, సండూర్‌పవర్‌ కంపెనీకి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిది కాదా అని బుద్దా నిలదీశారు. మంగళగిరి ప్రజలపై తనకే ప్రేమ ఉన్నట్లు ఆర్కే మాట్లాడుతున్నాడని, కోళ్లఫారం యజమానికి కోళ్లపై ఎంతప్రేమ ఉంటుందో, ఆళ్లకు కూడా మంగళగిరి ప్రజలపై అలాంటి ప్రేమే ఉందని వెంకన్న దెప్పిపొడిచారు. అటువంటి వ్యక్తి లోకేశ్‌ని, చంద్రబాబుని, భువనేశ్వరి పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 


పదవీకైపులో ఉన్న ఆళ్ల, నోరు అదుపులో పెట్టుకోకుంటే, తగినమూల్యం చెల్లించుకుంటాడన్నారు. రోడ్లపైఉన్న రైతుల్ని పరామర్శించే ధైర్యంలేని ఆర్కే,  అమరావతి రైతులముందుకురాని భారతి, షర్మిల గురించి ఎందుకు మాట్లాడటంలేదన్నారు. లక్షలకోట్లు దోచేసి, రూ.43వేలకోట్లు జప్తుచేయబడిన జగన్మోహన్‌రెడ్డి భయపడతాడుగానీ, ఏతప్పు చేయని చంద్రబాబుకి   భయం ఉండదన్నారు. తప్పుడుకేసులు వేస్తేనే కోర్టులు స్టేలు ఇస్తాయన్న విషయం  ఆళ్ల తెలుసుకోవాలన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: