ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండవ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసారు వైస్ జగన్ మోహన్ రెడ్డి..పదవిలో చేరిన తర్వాత నుండి చాలా మంచి పనులు చేశారు.. పింక్షన్ పెంచడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, పేదలకి ఇళ్ళు ఇప్పించడం లాంటి ఎన్నో మంచి పనులు చేసారు...నవశకం పేరు తో కొత్త మార్పులు తెచ్చారు. 

 

కాని ఒకే ఒక నిర్ణయం తో కొంతమంది ప్రజలలో విరుద్ధత వచ్చింది... రాజధాని అమరావతిలో కాకుండా మరో రెండు జిల్లాలు అయిన వైజాగ్ఏ, కర్నూలు లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయంని అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. ఈ రాజధాని రగడ గూర్చి ఎవరికి తోచినట్లు వారు విమర్శిస్తున్నారు.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు...

 

రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఎవరివల్ల కాదు... మీ "తాత, ముత్తాతల"వల్ల కూడా వీలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు.. పరిపాలించడం రాకపోతే రాజీనామా చేయాలనీ చెప్పారు... ఎదో ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ ప్రజల్ని అడగడం వల్ల గెలిపించారు. కానీ గెలిపించినందుకు ఏమి చేసారు.. చేతకాక పోతే పరిపాలన తెలుగుదేశం పార్టీ కి ఇవ్వాలని విమర్శించారు.. జగన్‌ను గెలిపించి తప్పు చేశామని, చంద్రబాబు కట్టాడనే ప్రజా‌వేదిక కూల్చివేయించాడని ఆరోపించారు. అమరావతి కి వస్తే ఆడవాళ్లు చీపురు కట్టలతో సమాధానం చెప్తారు అని అన్నారు..

 

151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా జగన్‌కు పాలన చేతకాలేదని ఎద్దేవా చేశారు. ‘మీకు 22 మంది ఎంపీలు ఉన్నా మేం ముగ్గురం చాలు’ అంటూ జగన్‌కు సవాల్ విసిరారు... ప్రశించడానికి మేము ముగ్గురం చాలు అని విమర్శలు చేసారు.. పాలన చేయకపోతే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు 

మరింత సమాచారం తెలుసుకోండి: