స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపధ్యం లో , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . ఈ నెల ఏడవ తేదీలోగా ఎన్నికల కమిషన్ కు నివేదిక అందజేయాలన్న హైకోర్టు , ఎనిమిదవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది . హైకోర్టు ఆదేశాల మేరకు  రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి , జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ,   శుక్రవారం  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు . జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఆరు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు .

 

 స్థానిక సంస్థల్లో మహిళలలు 50 శాతం పదవులను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే . ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 13  జిల్లాలకుగాను ఆరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మహిళలకు  రిజర్వ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు . దీనితో స్థానిక సంస్థల పదవుల్లో  మహిళలకు పెద్ద పీట వేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆచరణ రూపం దాల్చినట్లయింది  . పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ , అనంతపురం ఎస్సి , విజయనగరం ఎస్సి మహిళ, చిత్తూరు బిసి , కృష్ణా బిసి , విశాఖపట్నం బిసి మహిళ , శ్రీకాకుళం జనరల్ , వైస్సార్ కడప జనరల్ , ప్రకాశం జనరల్ , తూర్పు గోదావరి జనరల్ మహిళ , గుంటూరు జనరల్ మహిళ , కర్నూల్ జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు .

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశం పై పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్వేది , పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: