ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం హాట్ హాట్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేయడం... రాజధాని అధ్యయనం  కోసం నియమించిన జిఎన్ రావు కమిటీ, బోస్టన్  కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి అనుకూలంగా నివేదిక  అందించడం... జగన్ నిర్ణయంపై అమరావతి రైతులందరూ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తుండటం.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండటం  ఇలా రాష్ట్రం మొత్తం  హాట్ హాట్ గా మారిపోయింది . అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్ వంటి వాళ్లు సీఎం అవుతారని ఊహించి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడో  ఓ చోట ఇలాంటి వాళ్లకు అడ్డుకట్ట వేసే వారు అని సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. 

 

 

 7 కేసుల్లో  ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఏసీబీ అధికారులను మందలించడం సిగ్గుపడాల్సిన విషయమని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్మును బినామీ ఇంటికి ఖర్చు చేసిన జగన్ నీతులు చెబుతున్నారు అని... జగన్మోహన్రెడ్డి చెబుతున్న నీతి వాక్యాలను రాష్ట్ర ప్రజలంతా వినాల్సిన దౌర్భాగ్యం పట్టింది అంటు  వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటున్న నివాసం బినామీ  పేరు మీద ఉందని... దేశంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత ఇల్లు లేదు అంటూ వెల్లడించారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసం తాడేపల్లి లో ఇల్లు,  ఇడుపులపాయ ఎస్టేట్,  బెంగళూరులోని వైట్ హౌస్ ఏది కూడా జగన్ పేరు మీద లేదు అంటూ ఆయన వెల్లడించారు. 

 

 

 

 ఇవన్నీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది వర్ల రామయ్య విమర్శించారు. అంతేకాకుండా ఏపీ  అధికారులందరికీ వర్ల  రామయ్య హితవు  పలికారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి విషయానికి కనీసం వెనకా ముందు ఆలోచించకుండా ఎగిరెగిరి సంతకాలు పెడుతున్నారంటూ ఏపీ అధికారులను  విమర్శించారు టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య. అధికారులను జైలుకు పంపడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటేనని గతంలో శ్రీలక్ష్మి బ్రహ్మానందరెడ్డి బీపీ ఆచార్య రాజగోపాల్ వంటి అధికారుల పరిస్థితి ఏమైందో ప్రస్తుత ఏపీ అధికారులు అందరూ గుర్తుంచుకోవాలి అంటూ హితవు పలికారు. ఇకపోతే బోస్టన్  కమిటీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని  సమర్థిస్తూ నివేదిక  అందించడంతో ఆంధ్ర రాజకీయాల్లో  జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: