ఏపీ రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదక వివరాలను ప్రభుత్వం వివరించింది. ఈ కంపెనీ నివేదిక చూస్తే.. ఏపీ ప్రజలకు షాక్ తగలడం ఖాయం. ఎందుకంటే.. గత ఐదేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు అరచేతిలో అమరావతి అనే వైకుంఠం చూపించారు.

 

అమరావతి నగరాన్ని నిర్మిస్తే చాలు.. ఏపీ కష్టాలన్నీ తీరిపోతాయన్న తీరుగా ప్రచారం సాగించారు. తన అనుకూల మీడియాతో బాకాలు ఊదించారు. రాష్ట్రంలో ప్రతి సమస్యకూ అమరావతి నిర్మాణం ఒక్కటే పరిష్కారం అన్నంతగా ఊదరగొట్టేశారు. అమరావతి నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు అబ్బో.. చెప్పకుంటే అదో పెద్ద చరిత్రే అవుతుంది. దేశ దేశాలు తిరిగారు. రాజధాని డిజైన్ల కోసం పేరు గొప్ప నార్మన్ ఫోస్టర్స్ ను ఆశ్రయించారు.

 

రాజధాని నిర్మాణంలో సహకారం కోసం సింగపూర్ ను ఆశ్రయించారు. ఆ దేశం ఉచితంగా మాస్టర్ ప్లాన్ కూడా అందించిందని చెప్పారు. జస్ట్ ఒక్క లక్ష కోట్లు ఖర్చు చేశామంటే చాలు.. అమరావతి బంగారు బాతుగా మారిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా వెలువడిన బోస్టన్ నివేదికను చూస్తే కళ్లు తెరుచుకోకమానవి.. చంద్రబాబు గత ఐదేళ్లుగా ప్రజలను నయవంచన చేశారని అనిపించక మానదు.

 

ఎందుకంటే ఈ బోస్టన్ కంపెనీ.. కొత్తగా మహానగరాన్ని నిర్మించడం ఏమాత్రం లాభసాటి కాదని తేల్చి చెప్పింది. అసలు ప్రపంచంలో గ్రీన్ ఫీల్డ్ నగరాలు.. అంటే పూర్తి కొత్తగా నిర్మించిన నగారాలేవీ విజయవంతం కాలేదని చెప్పింది. అందుకు పుత్రజయ వంటి నగరాల ఉదాహరణలుగా చూపించింది. ఎందుకు కొత్తగా నిర్మించే మహానగరాలు సక్సస్ కాలేదో వివరించింది. అంటే గత ఐదేళ్లూ చంద్రబాబు చెప్పింది.. అంతా బూటకమేనా.. తన సామాజిక వర్గం కోసం ఆయన చేసిన ప్రయత్నమేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: