ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతిలో రైతులందరూ రోడ్ల మీదకు చేరి నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 3 రాజధానిల  నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది అని ప్రకటించినప్పటి నుంచి జగన్  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో అమరావతి రైతులు ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు . దీంతో రైతులు ఆందోళనలు నిరసనలు ధర్నాలు రాస్తారోకోలతో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. అంతేకాకుండా సకల జనుల సమ్మె నిర్వహించేందుకు అమరావతి రైతులందరూ పిలుపునిచ్చారు

 

 

 అటు అమరావతి నుంచి రాజధాని మార్పు విషయంలో కేంద్రం సహాయాన్ని అమరావతి రైతులు కోరినప్పటికీ కేంద్రానికి రాష్ట్ర పరిధిలోని రాజధాని మార్పు పై ఎలాంటి సంబంధం ఉండదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లో తమ నిరసనలతో రాజధాని అమరావతి నుంచి మారకుండా చూడాలని భావిస్తున్నారు. మూడు పంటలు పండించుకునే భూమిని అమరావతి నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని మార్చి మాకు అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు అమరావతి రైతుల చేపడుతున్న నిరసనలు ధర్నాలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 

 

 

 ఇక నేడు రాజధాని అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా రూపుదాల్చాయి. అమరావతిలో నిరసనలు  చేస్తున్న మహిళలపై పోలీసుల లాఠీచార్జి చేయడమే  పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ ఘటన పై టిడిపి నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నిరసన తెలుపుతున్న మహిళల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ మానవ హక్కుల కమిషన్ ను  కోరాడు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై దౌర్జన్యంగా దాడి చేశారని మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదు అంటూ ఆయన ఆరోపించారు. పోలీసులు మహిళలును  నోటికొచ్చినట్టు దూషించడమే కాకుండా... దాడి చేశారని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: