ఆడ‌బిడ్డ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కం అయిపోయిన ప‌రిస్థితి. దారుణాలు అనే ప‌దం కూడా స‌రిపోనంత ఆకృత్యం. మేకను దొంగిలించొద్దని అడ్డుకున్నందుకు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన హర్యానా ఫీరోజ్‌పూర్‌ జిర్కా ఏరియాలోని ఆరావలీ హిల్స్‌లో గతేడాది డిసెంబర్‌ 26న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ముగ్గురు బాలికలు కలిసి తమ మేకలను మేపేందుకు ఆరావలీ హిల్స్‌కు వెళ్లారు. ముగ్గురు వేర్వేరు చోట్ల మేకలను మేపుతున్నారు. ఓ బాలిక వద్దకు తాగుబోతు వచ్చి మేకను దొంగిలించేందుకు యత్నించాడు. ఆ బాలిక తన మేకను దొంగిలించొద్దని అడ్డుకుంది. దీంతో ఆ బాలికపై అత్యాచారం చేసి.. చున్నీతో ఆమెను చెట్టుకు ఉరేశాడు. ఆ తర్వాత మేకను తీసుకుని వెళ్లిపోయాడు.



అయితే, మిగతా ఇద్దరు బాలికలు తమ నివాసాలకు వచ్చారు. కానీ మరో బాలిక మాత్రం రాలేదు. దీంతో గ్రామస్తులు బాలిక ఆచూకీ కోసం వెతకగా అడవుల్లో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫీరోజ్‌పూర్‌ జిర్కా ఏరియాలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా.. మేకతో వెళ్తున్న వ్యక్తి కనిపించాడు. ఢిల్లీలో డిసెంబర్‌ 28న ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.



ఇదిలాఉండ‌గా, ఈ రాష్ట్రంలో కొద్దిరోజుల కితంగా ఇలాంటిదే మ‌రో దారుణం జ‌రిగింది. హర్యానాలోని గుర్గావ్‌కు సమీపంలోని చక్కార్‌పూర్‌ గ్రామంలో బాలిక కిడ్నాప్‌ విఫలమైందని ఆమె ముక్కును కోసేశారు దుండగులు. అదే గ్రామానికి చెందిన కొంతమంది దుండ‌గులు అదే గ్రామంలోని ఓ బాలికి ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులను కొట్టి బాలికను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు దుండగులను అడ్డుకోవడంతో.. కోపంతో బాలిక ముక్కును కోసేసి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇంట్లోకి ఆరేడుగురు వ్యక్తులు ప్రవేశించగా, ఇంటి బయట సుమారు 20 మంది వ్యక్తులు కాపలా ఉన్నారు.బాలిక కుటుంబానికి ఎవరూ సహాయం చేయొద్దని వారు ఆదేశించారు. దీంతో ఇరుగుపొరుగు వారు కూడా ముందుకు రాలేదు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను గౌరవ్‌ యాదవ్‌, ఆకాశ్‌ యాదవ్‌, సతీష్‌ యాదవ్‌, మోను యాదవ్‌, లీలూ యాదవ్‌గా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే గ్రామంలో తమ మాట వినకపోయినా, కేసులు ఉపసంహరించుకోకపోయినా.. అలాంటి కుటుంబాలపై వీరు దాడులు చేస్తారని బాధితురాలి సోదరుడు పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: