ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో నాకు సంబంధం లేదని ఆ కంపెనీ డైరెక్టర్, రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు స్పష్టం చేశారు. గుంటూరులో రాయపాటి నివాసంలో సిబిఐ అధికారులు జరిపిన సోదాలు, జరుగుతున్న పరిణామాల గురించి రాయపాటి రంగారావు శుక్రవారం నాడు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ. గతంలో మా తల్లిగారు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో కేవలం డైరెక్టర్ గా మాత్రమే ఉన్నారని, కంపెనీ ఆర్ధిక వ్యాహారాలన్ని ఎండీగా ఉన్న శ్రీధర్ వివిధ బ్యాంకుల నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.  

ఈడీ కేసు నమోదు..

నిధుల మళ్లింపుపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో  పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై ఇప్పటికే  సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్‌ డైవర్ట్‌ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్‌,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి.

నిధులను దారి మళ్లించారు..
కంపెనీలో శ్రీధర్ అవకతవకలు పాల్పడి నిధులను దారి మళ్లించారు. ఆ విషయం మా తల్లి   చనిపోయిన తర్వాత తెలిసింది.  దీనిపై తాను ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక శాఖ కేంద్రమంత్రిగా ఉన్న  నిర్మల సీతారామన్ కు ,  రిజర్వ్ బ్యాంకు గవర్నర్ , సీబీఐ డైరెక్టర్ కు సెప్టెంబర్ 26, 2019 నాడు ట్రాన్స్ ట్రాయి కంపెనీలో భారీ మోసం జరిగినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రంగారావు తెలిపారు. దీనితో  సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించగా బ్యాంక్ వారు ట్రాన్స్ ట్రాయిలో  జరిగిన అవకతవకలు వాస్తవమేనని అంగీకరించి నవంబర్ 11వ తేదీన ఫిర్యాదు చేశారు. 

లోపాయికారి ఒప్పందంలో..
గత రెండు సంవత్సరాల నుండి ఇంత అవినీతి జరుగుతున్నా కూడా బ్యాంకు వారు మౌనం దాల్చడం చెరుకూరి శ్రీధర్, బ్యాంక్ అధికారుల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందంలో భాగమేనన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు రంగారావు తెలిపారు. అలాగే మీడియా సంస్థల్లో వస్తున్నటు వంటి వార్త పూర్తిగా అవాస్తవమన్నారు. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: