బోస్టన్ గ్రూప్ కమిటీ తన నివేదికను ఈరోజు ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే.  ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలనీ తెలిపింది.  విశాఖనే రాజధానిగా అభివృద్ధి చేయాలనీ, విశాఖ నుంచి చెన్నై కు రోడ్డు మార్గం అభివృద్ధి చెంది ఉందని, అందుకే విశాఖ ప్రాంతం అత్యంత అనువైన ప్రాంతం అని చెప్పింది.  అలానే అభివృద్ధిలో భాగంగా విజయవాడ, కర్నూలు ను కూడా అభివృద్ధి చేయాలని సూచించింది.  


అయితే, బోస్టన్ నివేదికను  కమిటీ సభ్యులు ప్రభుత్వానికి అందజేశారు.  బోస్టన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  మూడు వారాల్లోనే ఆ కమిటీ తన నివేదికను ఇస్తుంది.  అయితే, బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతున్నది.  బోస్టన్ కంపెనీ ఇప్పటికే యూరప్ అనేక ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.  


అనేక అవినీతి మరకలు ఉన్న బోస్టన్ గ్రూప్ ను నమ్మి ఎలా నివేదికను తయారు చేయించారని ప్రశ్నిస్తున్నారు.  బోస్టన్ గ్రూప్ లో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.  కోర్టు కేసులను కూడా ఆ కంపెనీ ఎదుర్కొంటున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు.  బోస్టన్ నివేదిక జగన్ చెప్పినట్టుగా రాసిందని, దానికి చట్టబద్దత లేదని, అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి జగన్ ఎత్తులు వేశారని, ఇందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని అంటున్నారు.  


బోస్టన్ నివేదికకు చట్టబద్దత లలేనప్పుడు దానిని ఎలా నమ్ముతామని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.  రాజధానిని అక్కడి నుంచి కదిలిస్తే దాని వలన జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనిహెచ్చరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.  ఇక ఇదిలా ఉంటె అమరావతిలో ఉన్న సచివాలయాన్ని ఏప్రిల్ 6 వ తేదీ వరకు విశాఖకు మార్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.  ఏప్రిల్ 6 నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: