జనవరి నెలాఖరులోగా రాజధాని విశాఖకు వెళ్లిపోవడాన్ని ఎవరూ ఆపలేరు. రాజధాని తరలింపు మీద ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించగా... రాజధాని మార్పును ఎవరు కూడా నిలువరించజాలరని స్పష్టమవుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దుష్టమైన వైఖరితో ముందుండుగు వేస్తున్నారని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలు హర్షిస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.   

జగన్ ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన గ్రామ సచివాలయాలలో 550  రకాల సేవలకు సంబంధించి అక్కడే పనులు జరిగిపోతున్నాయి.  దీనికి తగ్గట్లుగా సాఫ్ట్వేర్ ను రూపొందించారు.   కనీసం తాసిల్దార్ ఆఫీసుకు కూడా ఎవ్వరూ వెళ్లడం లేదు.  ఇవాళ అప్లై చేసుకుంటే రెండు రోజుల్లోగా ఆమోదం/తిరస్కరణ తెలిసిపోతుంది.  గుమస్తాలకు, అధికారులకు లంచాలు ఇచ్చే అవస్థ తప్పింది.    ఈ కారణంగా సామాన్య ప్రజలకు రాజధానితో ఎలాంటి సంబంధమూ లేదు.  ఒకప్పుడు కొన్ని పనులకు హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చేది.  ఇపుడా ఖర్చు లేకుండా అవసరాలు తీరిపోతున్నాయి.  

రాజధానిని అమరావతిలో పెట్టినా, విశాఖలో పెట్టినా, తిరుపతిలో పెట్టినా సామాన్య ప్రజలు ఎవ్వరూ వెళ్లాల్సిన పనిలేకపోవడంతో రాజధాని మార్పు గూర్చి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.   సచివాలయం వెళ్తేనే కానీ పనులు కావనుకునేవారి సంఖ్య స్వల్పాతిస్వల్పం.  వందల వేల కోట్లరూపాయల కాంట్రాక్టులు, టెండర్లు లాంటి వ్యాపారాలవారే సచివాయలం వెళ్లాల్సి వస్తుంది.  

ఇక అమరావతిలో ఆందోళన చేస్తున్నది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్కడ పదులకొద్దీ ఎకరాల స్థలాలు కొనుక్కున్న వారే.  రాజధాని పరిధిలోని కృష్ణా జిల్లాల వారు, మంగళగిరి ప్రాంతం వారు ఎవరూ ఆందోళన చెందడం లేదు. ప్రస్తుతం రైతుల పేరుతో జరుగుతున్న డ్రామాలు అన్నీ నెలరోజుల్లోగా సమసిపోతాయి.  

గత నాలుగేళ్లనుంచి చంద్రబాబు మరుభూములుగా మార్చిన పంటపొలాలు మళ్ళీ నీటివసతిని కల్పించడం ద్వారా సాగులోకి తీసుకుని రావచ్చు. ఒకప్పుడు పంటపొలాలు తగలబెట్టారని నానా గోల చేసిన రైతులు నేడు రోడ్లమీదికొచ్చి ఉద్యమాలు చేస్తున్నారంటే ఇవన్నీ ప్రాయోజితమైనవే. దీనివెనుక చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, మరికొందరు తెలుగుదేశం నాయకుల స్వార్ధప్రయోజనాలు ఉన్నాయి. జనవరి నెలాఖరులోగా రాజధాని విశాఖకు వెళ్లిపోవడాన్ని ఎవరూ ఆపలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: