వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చాలా మంది చిన్న వేతనదారుల జీతాలు పెంచారు. ఆశావర్కర్ల జీతాలు పెంచారు. అయితే ఇప్పుడు మరో ఉద్యోగుల జీతాలు పెంచారు జగన్. పెంచడం అంటే అలా ఇలా కాదు.. ఏకంగా రెండు రెట్లుచేశారు. ఇప్పటి వరకూ 8 వేల రూపాయల జీతం తీసుకునేవారు.. ఇప్పుడు ఏకంగా రూ. 16 వేల రూపాయల జీతం అందుకోబోతున్నారు.

 

ఇంతకీ వీరు ఉన్నతోదోగ్యులో కాదు.. కేవలం పారిశుధ్య కార్మికులు. ఆసుపత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు.. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. “ రెండు నెలల క్రితం ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మిక పనులు చేస్తున్న వారు నా వద్దకు వచ్చారు. చాలీచాలని జీతంతో పని చేస్తున్నామని, రూ.8 వేలతో బతకలేకపోతున్నామని చెప్పారు. ఈ నెల నుంచి వారి జీతాలు రూ.16 వేలు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

 

మూడేళ్లలో ఆసుపత్రులను దశలవారీగా మార్పు చేయబోతున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాల రూపురేఖలను మార్చేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. వేగంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల రూపురేఖలు మార్చి జాతీయ ప్రమాణాలకు సమానంగా తీసుకువస్తాం. మార్చి నెలాఖరుకల్లా అక్షరాల 1060 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా రోడ్లపై తిరుగుతాయి. 108, 104 కొత్త వాహనాలు రోడ్లపై తిరుగుతాయి. మిమ్మల్ని చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాయి. నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల పనితీరు మెరుగు పరుస్తాం.

 

" గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం. మే నెలాఖరుకు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులు, నర్సులు, అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తాం. అక్టోబర్‌ 10న వైయస్ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాం. దాదాపు 66 లక్షల బడిపిల్లలకు కంటి పరీక్షలు చేయించాం. లక్ష 47 మంది పిల్లలకు కళ్లజోళ్లు అందజేశాం. 45 వేల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఫిబ్రవరి 1న అవ్వతాతలకు కంటి వెలుగు కార్యక్రమం వర్తింపజేస్తామన్నారు సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: