ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి సీఎం జగన్ రైతుల సంక్షేమం కొరకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ రైతులకు మరో గుడ్ న్యుస్ చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులు నేటి నుండి రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. సీఎం జగన్ వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే రైతుల ఖాతాలలో తొలి, రెండో విడతలలో వైయస్సార్ రైతు భరోసా 11,500 రూపాయలు జమ అయ్యాయి. ప్రభుత్వం మూడో విడత 2000 రూపాయలను కూడా బదిలీ చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలలో రైతు భరోసా పథకానికి అర్హులైన వారి వివరాలను బుధవారం నుండే అందుబాటులో ఉంచారు. మూడో విడత డబ్బులు జమ అయ్యాయో లేదో ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
 
అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకునేవాళ్లు మొదట వైయస్సార్ రైతు భరోసా అధికారిక వెబ్ సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ లోకి వెళ్లాలి. ఆ తరువాత హోం పేజీలో కనిపించిన payment status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ నొక్కితే మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. 
 
ఈరోజు నుండి రైతుల ఖాతాల్లో మూడో విడత డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి సాయంత్రం నుండి ఈ వివరాలు లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్హులైన రైతులకు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తరువాత రైతు పూర్తి వివరాలతో పాటు ఏ బ్యాంకులో నగదు క్రెడిట్ అయిందో మరియు ఎంత క్రెడిట్ అయిందో అనే వివరాలు కూడా ఉంటాయి.  సంక్రాంతి పండుగకు రైతు భరోసా మూడో విడత రైతుల ఖాతాలలో జమ చేస్తానన్న జగన్ ముందే ఖాతాలలో జమ చేస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: