ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 80 రోజుల్లో పరీక్షలు మొదలుకానున్నాయి. ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. 2020 సంవత్సరం మార్చి 23వ తేదీన పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్ 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
 
ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగుతాయి. మార్చి 23వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, మార్చి 24వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 27వ తేదీన ఇంగ్లీష్ పేపర్ 1, మార్చి 28వ తేదీన ఇంగ్లీష్ పేపర్ 2, మార్చి 30వ తేదీన గణితం పేపర్ 1, మార్చి 31వ తేదీన గణితం పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. 
 
ఏప్రిల్ 1వ తేదీన సైన్స్ పేపర్ 1, ఏప్రిల్ 3వ తేదీన సైన్స్ పేపర్ 2, ఏప్రిల్ 4వ తేదీన సోషల్ స్టడీస్ పేపర్ 1, ఏప్రిల్ 6వ తేదీన సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన అరబిక్, సంస్కృతం, పర్షియన్ సబ్జెక్ట్, ఏప్రిల్ 8వ తేదీన ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. నూతన విధానంలో ఈ సంవత్సరం పరీక్షలు జరగబోతున్నాయని తెలుస్తోంది. పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారని తెలుస్తోంది. 
 
బిట్ పేపర్ వేరేగా ఉండదని ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారని విడుదల చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు. పాస్ మార్కుల గురించి ప్రభుత్వం జీవోలో ప్రస్తావించకపోవడంతో పాత పద్ధతిలో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: