ఈ మధ్యకాలంలో మనుషులు బొత్తిగా సిగ్గును వదిలేస్తున్నారు. నాలుగు గోడల మద్య చేసుకునే పనులను, నలుగురిలో చేసుకుంటున్నారు. పక్కన మనుషులు ఉన్నారా, లేరా, లేక తాము చేసే ఇలాంటి పనికి మాలిన పనులవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

 

పబ్లిక్ ప్లేస్‌లల్లో ఈ మధ్యకాలంలో న్యూసెన్స్ చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇకపోతే కొందరు పెద్ద మనుషులు అని చెప్పుకునే వారు చేసే పనుల వల్ల ఆ పెద్దరికానికే చెడ్దపేరు వస్తుంది. ఇదిగో ఇప్పుడొక పెద్దమనిషి ఒంటి మీద బట్తలు తొడుకున్నట్లే గాని పూర్తిగా ఓ సిగ్గుమాలిన పని చేసాడు. ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో జరిగింది. అదేంటో చూస్తే. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని టెర్మినల్‌లో కూర్చుకున్న ఓ వ్యక్తి ఏదో టెన్షన్ పడుతూ, బిత్తరచూపులు చూస్తూ మెల్లిగా ఏవో కదలికలు చేస్తున్నాడట.

 

 

అతడు చేస్తున్న పని ఏంటో సరిగా ఎవరికి అర్ధం కావట్లేదట. కాని అతన్నే గమనిస్తున్న తోటి ప్రయాణికుడికి విషయం అర్ధం అయ్యి వెంటనే తన మొబైల్ కెమెరాకు పనిచెప్పాడు. కాగా ఆ కూర్చున్న వ్యక్తి అందరు చూస్తున్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బహిరంగంగా మూత్రవిసర్జన చేశాడు. అతను కూర్చున్న చోట నుండి నీరు రావడం గమనించిన అతని ప్రక్కనున్న ప్రయాణికులు ఒక్క సారిగా షాక్ తిన్నారట.

 

 

ఇకపోతే ఈ తతంగాన్నంతా వీడియోను తీసిన వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోను 2 లక్షల మంది వరకు చూసి వివిధరకాలుగా కామెంట్స్ పెడుతున్నారట. అందులో కొందరు అతడు సిగ్గొదిలేసినట్లు ఉన్నాడు, అందుకే అలా చేశాడని అనగా, మరి కొందరు, అతడు చేసిన పనికి ఎయిర్ పోర్టు అధికారులు ఈ ప్రబుద్దుడికి తగిన బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారట..   

మరింత సమాచారం తెలుసుకోండి: