ఈ ఏడాది బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వచ్చే సంవత్సరంగా ఉన్నది.  బ్యాంకులకు మాత్రమే కాదు... సామాన్యులకు కూడా ఎక్కువగా సెలవులు వచ్చే ఏడాదిగా 2020 మారబోతున్నది.  దీనిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే... అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.  ఇక ఇదిలా ఉంటె ఈనెల 8 వ దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయకపోవచ్చని అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు.  8 వ తేదీన బ్యాంకు స్ట్రైక్ చేయబోతున్నాయి.  బ్యాంకింగ్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, బ్యాంకుల విలీనం ప్రక్రియ వలన ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయని, అందుకే స్ట్రైక్ చేయబోతున్నట్టుగా బ్యాంక్ యూనియన్లు చెప్తున్నాయి.  


దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగంగా ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా దీనిపై వివరణ ఇచ్చింది.  తమకు ఉద్యోగులు కొంతమంది మాత్రమే ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది.  అంతేకాదు, ఆరోజు జరిగే సమ్మె కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది.  సమ్మె రోజున ఏటీఎంలు కొన్ని పాక్షికంగా పనిచేయకపోవచ్చు.  బ్యాంకుకు సంబంధించిన పనులు ఏవైనా ఉన్నా, లేదంటే, బ్యాంకు ఏటీఎం ల నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకున్నా వెంటనే డబ్బులు చెల్లించి వాటిని తీసుకోవాలి.  లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.  


ఇక ఈ సమ్మెలో 6 బ్యాంక్ యూనియన్లు పాల్గొనబోతున్నాయి.  ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), బ్యాంక్ కర్మాచారి సేన మహసంఘ్ (బీకేఎస్‌ఎం) అనే యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.  


కేవలం బ్యాంక్ యూనియన్లే కాకుండా బయట నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగులు, టీచర్లు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేస్, స్టీల్, డిఫెన్స్ ప్రొడక్షన్ రంగాలకు చెందిన వర్కర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని సమాచారం.  వీటితో పాటుగా దేశంలోని 10 ట్రేడ్ యూనియన్లు కూడా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: