ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్ఆర్సీని  తమ రాష్ట్ర పరిధిలో అమలు చేయబోమని అంటూ తేల్చి చెప్పారు. ఇక సిఏఏ,  ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు అందరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉత్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకపోతే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 

 

 

 కానీ చివరికి నవ్వుల పాలయ్యారు. ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సినదే .. చిన్న అవకాశం వస్తే చాలు భారత్ పై తన అక్కసును వెళ్లగక్కటానికి  ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇప్పటికే ఎన్నోసార్లు భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. తాజాగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో నవ్వులపాలు అయిపోయాడు ఇమ్రాన్ ఖాన్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న ముస్లింలను దారుణంగా హింసిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు ఇమ్రాన్ ఖాన్. దానికి 3 వీడియో లను జత చేశారు. ఇమ్రాన్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

 

 

 దీంతో తన తప్పును గ్రహించిన ఇమ్రాన్ ఖాన్... ట్విట్టర్లో తన పోస్ట్ చేసిన వీడియోలను వెంటనే డిలీట్ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ వీడియోలను డిలీట్ చేసేటప్పటికి ఎంతోమంది ఇమ్రాన్ ఖాన్ తీరుపై విరుచుకుపడుతూ విమర్శలు చేశారు. ఎందుకంటే నిజానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి పోస్ట్ చేసిన వీడియోలు భారత్లో పౌరసత్వ సవరణ చట్టం పై జరుగుతున్న ఆందోళన కు సంబంధించినవి కావు.. 2003లో డాకలో  ఆందోళనకారులపై బంగ్లాదేశ్ యాక్షన్ ఫోర్స్ చేసిన లాఠీచార్జి దృశ్యాలు. ముందు వెనకా ఆలోచించకుండా వాటిని పోస్ట్ చేసి పాక్ ప్రధాని అభాసుపాలు అయిపోయారు.ఓ  దేశానికి ప్రధాని అయి ఉండి కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు ఎలా పోస్ట్ చేశారు అంటూ అందరూ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకు పడ్డారు నెటిజన్లు . భారత్ ను ఇరుకున  పెట్టే ప్రయత్నంలో ఆయన నవ్వుల పాలు అయ్యారు అంటూ నెటిజనుల కామెంట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: