ఎన్నికలు వచ్చినప్పుడు అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేస్తారనే విషయం తెలిసిందే.ఈ ఓటరు  జాబితాలో ఎన్నో  చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఎంతలా అంటే ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు రావడం ఓటు హక్కు ఉన్న వారికి మాత్రం  ఓటు హక్కు తొలగించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదండోయ్ ఈ లోకంలో లేని వారికి కూడా ఓటు హక్కు వస్తూ ఉంటుంది.. కేవలం ఓటు హక్కు రావడమేనా ఏకంగా  పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. అదెలా అంటారా... అది మాత్రం ఎవరికీ తెలియదు కానీ అక్కడ చనిపోయిన వారు వచ్చి  ఓటు మాత్రం వేసినట్లు మాత్రం  ఉంటుంది. ఇలా ప్రతిసారి ఓటర్ల జాబితా విడుదలైనపుడల్లా  ఎన్నో చిత్రవిచిత్రాలు బయట పడుతూనే ఉంటాయి. 

 

 

 

 ఇది అధికారుల తప్పిదమా ప్రభుత్వ తప్పిదమా  తెలియదు కానీ... ఇలాంటి తప్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అంతేకాదండోయ్ కొన్నిసార్లు ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గానికి ఓటర్ జాబితాలో లేకుండా చేసి ఓట్లు తొలగించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తమకు  వ్యతిరేకంగా ఉండే వారికి సంబంధించిన కొన్ని ఓట్లను ప్రభుత్వం తొలగిస్తూ ఉంటుందని అప్పుడప్పుడు టాక్ కూడా వినిపిస్తుంది. ఓటర్ జాబితా లో ఇలాంటి అవతవకలు  జరగండం  కొత్తేమి కాదు. ఇప్పటికే  ఎన్నో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని కొన్ని సార్లు అప్పుడే పుట్టిన చిన్నారులకు కూడా ఓటు హక్కు వస్తూ ఉంటుంది దీంతో ఇది చూసిన ప్రజలు మాత్రం అబద్దం అవాక్కవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 

 తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల కోసం అధికారులు తయారుచేస్తున్న ఓటరు జాబితాలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఎన్నో చిత్రవిచిత్రాలు రోజు కోటి  బయటకు వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లో మూడేళ్ల చిన్నారి కి ఓటు హక్కు కల్పించారు అధికారులు. మారుతి నగర్ పాత బజార్ కు చెందిన 3 ఏళ్ళ వయసున్న ఎల్కేజీ చదువుతున్న చిన్నారి మెతుకు నందితకు  ఓటు హక్కు కల్పించారు  అధికారులు. అంతే కాదు ఓటర్ లిస్టులో ఈ చిన్నారి ఫోటో పక్కన ఈ చిన్నారి వయసు 35 సంవత్సరాలుగా నమోదు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ చిన్నారి ఓటర్ లిస్ట్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: