ఇండియా పాక్ దేశాలు 1947 వ సంవత్సరంలో అధికారికంగా విడిపోయాయి.  ముస్లింలకు పాకిస్తాన్ పేరుతో సపరేట్ దేశం ఏర్పాటు జరిగింది.  ఈ ఏర్పాటు సమయంలో పాకిస్తాన్ లో 23శాతం హిందువులు ఉన్నారు.  వాళ్ళు అక్కడ మైనారిటీలు.  క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది.  ఇప్పుడు అక్కడ కేవలం 3శాతం మంది హిందువులు మాత్రమే ఉండటం విశేషం.  మిగతా వాళ్ళు ఏమయ్యారు అనే దానికి పాక్ దగ్గర జవాబు లేదు.  


పాకిస్తాన్ లో హిందువులపై ముస్లింలు దాడులు చేస్తున్నారు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి.  కానీ, ప్రపంచ దేశాలు దానిని పట్టించుకోవడం లేదు.  చైనా అండతో ఆ దేశం రెచ్చిపోతున్నది.  హిందువులను బలవంతంగా అపహరించి మత మార్పిడులు చేస్తున్నారు.  మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు.  ఈ విధంగా అక్కడి జనాభా తగ్గిపోయింది.  ఏమిటని ప్రశ్నిస్తే చంపేస్తున్నారు.  మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితి.  


అందుకే అక్కడి నుంచి హిందువులు ఎలాగోలా పారిపోయి ఇండియాకు వస్తున్నారు.  ఇండియాలో ఏదోవిధంగా బ్రతుకును వెళ్లదీస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న సిక్కుల పవిత్ర దేవాలయం గురుద్వారాపై కొంతమంది యువకులు రాళ్లు విసిరారు.  హిందువులకు, సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  
గురుద్వారా పతి కుమార్తె జగజ్జిత్ కౌర్ ను మహ్మద్ అనే యువకుడు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

 

 బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  దీంతో పాక్ మూక రెచ్చిపోయింది.  గురుద్వారా వద్దకు వచ్చి రాళ్లు విసిరింది.  కర్రలతో దాడులు చేసింది.  కౌర్ ఇష్టపూర్వకంగానే మతం మార్చుకొని వివాహం చేసుకుందని  ముస్లింలు అంటున్నారు. అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొనడంతో ఇండియా విదేశాంగ శాఖ స్పందించి సిక్కులను రక్షించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  అయితే, ఇప్పటి వరకు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: