మెగాస్టార్ చిరంజీవి పై పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారా..?? చిరజీవి పేరు చెప్తేనే మండిపడుతున్నారా..?? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న  రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెలకొన్న పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. అసలు పవన్ ఫ్యాన్స్ కి చిరు పై ఎందుకు కోపంవచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారి ఎన్నో అనుమానాలకి తావిస్తోంది. 

 

ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత అన్నతో విభేదించిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత కూడా సుదీర్ఘంగా చిరుతో ముభావంగానే ఉన్నాడనేది అందరికి తెలిసిందే. మధ్య మధ్యలో చిరు, నాగబాబులు  ఆడియో ఫంక్షన్ లలో సైతం పవన్ ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తరువాత ఎన్నికలు దగ్గరపడిన సమయంలో పవన్ ఫ్యామిలీ కి దగ్గరవ్వక తప్పలేదు. చిన్న చిన్న సందర్భాలలో అన్న దమ్ముల మధ్య గొడవలు లేవు అన్నట్టుగా కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల  ప్రచారానికి మెగా ఫ్యామిలీ నుంచీ కొంతమంది వెళ్ళినా చిరు మాత్రం ఎలాంటి మద్దతు ప్రకటన చేయలేదు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూశారు పవన్ కళ్యాణ్..కట్ చేస్తే 

 

వైసీపీ  ప్రభుత్వం ఏర్పడిన నాటి మొదలు ఈ రోజు వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కంటి మీద కునుకు ఉండటటం లేదు. ఎప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందా, కనీసం చిన్న తప్పు చేసినా చాలు దానిని జీడిపాకంలా సాగాదీద్దమా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే చిరు జగన్ ని కలవడమే, లేదా జగన్ పాలన బాగుందంటూ చెప్పడమో ఇవన్నీ యాదృశ్చికంగా జరిగిపోయాయి. తాజాగా రాజధాని విషయంలో పవన్ అమరావతిలో చేసిన అరుపులు కేకల  యాక్టింగ్ అందరికి చూసిందే. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలో చిరు మా సినిమా డైరీ ఆవిష్కరణ వేదికపై జగన్ ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు చేశారు.అయితే ఇది కూడా  యాదృశ్చికంగా జరిగిన సంఘటనే అయినా...

 

పవన్ కళ్యాణ్ ఈ రెండు ఘటనలపై చాలా అసహనం వ్యక్తం చేశారని జనసేన వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ , అన్న చిరంజీవి తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం  చేస్తున్నారట. సహజంగా అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు పట్టించుకోరు కానీ పవన్ కి అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్న  ఓ వ్యక్తి  చిరంజీవి కావాలనే ఈ విధంగా ప్రవర్తిస్తూ ప్రజల్లో జనసేనని చులకన చేస్తున్నారంటూ అన్న దమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నారట. ఈ క్రమంలోనే సదరు నేత పవన్ ఫ్యాన్స్ కి చెందిన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా చిరు పై పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్త పరుస్తున్నట్టుగా పోస్టులు పెట్టిస్తున్నారని, చివరికి పవన్ ఫ్యాన్స్ కి చిరుకి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారని, మొత్తానికి మెగా ఫ్యామిలీ లోనే చిచ్చు పెట్టే పెద్ద కార్యక్రమాన్నే భుజాన వేసుకున్నారనే టాక్ రాజకీయ వర్గాలో జోరుగా చర్చకి వస్తోంది. ఏది ఏమైనా చిరు లేకపోతే పవన్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచీ వచ్చారంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: