రాజధానిపై వివాదం రేగుతున్న నేపధ్యంలో  జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు చంద్రబాబునాయుడులో టెన్షన్ పెంచేస్తోంది. ఏపికి మూడు రాజధానులు ఉందచ్చంటూ జగన్మోహన్ రెడ్డి చేసి ప్రకటనను చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవిషయం తెలిసిందే.  మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నా, అమరావతిని తరలించాలన్నా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు డిమాండ్ చేయటమే కాకుండా ఇతర పార్టీలతో కూడా డిమాండ్లు చేయిస్తున్నారు.

 

ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేసే వాళ్ళకు తొందరలో జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలే గీటు రాయిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. జిల్లా, మండల పరిషత్ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఏడు జడ్పీలు, జనరల్ క్యాటగిరీలకు ఆరు జిల్లాలు కేటాయించారు.

 

ప్రస్తుత పరిస్ధితుల్లో పోటిచేయటానికి  టిడిపి నుండి సీనియర్ నేతలెవరూ ముందుకు రావటం లేదని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో పార్టీలోని నేతల్లో చాలామంది నిరాసలో ఉన్నారు. అందుకనే కొందరు బిజెపిలోకి మరికొందరు వైసిపిలో చేరుతున్నారు. ఇద్దరు ఎంఎల్ఏలు కూడా పార్టీకి దూరమైపోయారు.  ప్రస్తుత రాజధాని వివాదంలో  ఇటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు అటు కర్నూలులో హై కోర్టు ఏర్పాటు విషయంలో రాయలసీమలోని నాలుగు జిల్లాల జనాలు చంద్రబాబుపై మండిపోతున్నారు.

 

ఎందుకంటే  రాజధానితో సహా అన్నీ అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తు చంద్రబాబు రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులతో  కావాలనే గోల చేయిస్తున్నారు. అంటే జగన్ చెప్పినట్లుగా విశాఖపట్నంలో రాజధానిని, కర్నూలులో హై కోర్టును కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నట్లయిపోయింది. అధికారంలో ఉండగా ఉత్తారంధ్ర, రాయలసీమ ప్రాంతాలను దెబ్బకొట్టిన చంద్రబాబు ఇపుడు జగన్ కు కూడా ఇబ్బంది పెడుతున్నారనే భావన పెరిగిపోయింది.

 

దాంతో  పై రెండు ప్రాంతాల్లోని ఏడు జిల్లాల్లో  జనాలు  చంద్రబాబు అంటేనే  మండిపోతున్నారు.  అదే సమయంలో జగన్ ప్రతిపాదనపై ప్రస్తుత రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా జనాలు చంద్రబాబుకు సానుకూలంగా స్పందించటం లేదు. అదే సమయంలో జగన్ ప్రతిపాదనకు ఈ రెండు జిల్లాల ప్రజలు సానుకూలమేనా అన్న విషయమూ తెలియటం లేదు.  రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికలే అన్నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అందుకనే  చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: