రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్న  విషయం తెలిసిందే. ఇక రోడ్డు మీద నడుస్తుంటే ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అసభ్యకరమైన మాటలతో పిచ్చి పిచ్చి చేష్టలతో మహిళను లైంగికంగా మానసికంగా వేధిస్తుంటారు. అయితే చాలా మంది మహిళలు ఇలాంటి ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు భయపడి... పరుగులు పెడుతూ ఉంటారు. కానీ చాలా కొంతమంది మాత్రమే ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ఆకతాయిలకు బాగా బుద్ధి చెబుతూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళ అలాంటి పని చేసింది.తనతో  చెత్తగా ప్రవర్తించిన వ్యక్తికి  గట్టిగా బుద్ధి చెప్పింది. తనపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పిదిగుద్దులు కురిపించి  పోలీసులకు అప్పగించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై మహిళా  పిడిగుద్దులు కురిపించి  స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించిన ఘనత హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగింది. సికింద్రాబాద్ లోని వారసిగూడ కు చెందిన ఓ మహిళ మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తుంది. నాలుగు నెలల గర్భవతి అయిన ఈ మహిళ గురువారం రాత్రి విధుల్లో ఉండగా తొమ్మిది గంటల సమయంలో ఆమె భర్త వచ్చాడు. దీంతో తన భర్తతో కలిసి వైఎస్ఆర్ చౌరస్తా సమీపానికి వెళ్లి  భోజనం చేశారు. అనంతరం భర్త వెళ్ళి పోగా  ఆమె నడుచుకుంటు  కంపెనీకి బయలుదేరింది. రాత్రి సమయం కావడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమె పై అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. 

 

 

 సదరు మహిళ నడుస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయివేసి అసభ్యంగా  ప్రవర్తించాడు. అయితే ఆ వ్యక్తి  ప్రవర్తనతో షాకైన ఆ మహిళ షాక్  నుండి తేరుకుని ఆ వ్యక్తి వంక కోపంగా చూడటం తో aa వ్యక్తి  వెనక్కి తగ్గి వెనుక అడుగు వేసి వెళ్ళిపోతున్నాడు. కానీ సదరు మహిళా  మాత్రం వెనక్కి తగ్గలేదు. అతడిని వెంబడించి మరి అతని పట్టుకొని నిలదీసింది. దీంతో మహిళపై దాడి చేసేందుకు యత్నించాడు ఆ వ్యక్తి. అయినప్పటికీ కూడా ఆ మహిళ ధైర్యం కోల్పోలేదు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బాధిత మహిళ అతడిపై ఎదురుదాడికి దిగి పిడిగుద్దులు  కురిపిస్తూ  గట్టిగా కేకలు వేసింది. అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే వ్యక్తిని పట్టుకుని 100 ఫోన్  చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: