ప్రతి మనిషికి ప్రాధమిక హక్కులు బాధ్యతలు ఉన్నట్లుగానే ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన విధంగా తాను ఎంచుకున్న మార్గంలో డబ్బు సంపాదన అతడి హక్కు. సిరి సంపదల సమృద్ధికి ఆర్ధిక స్వేచ్చకు మనిషి పుట్టినరోజు నుండి అతడి మరణం వరకు ఒక వ్యక్తి ఆలోచనలు పరిభ్రమిస్తూనే ఉంటాయి.

జీవితాన్ని ఆనందమయం చేసుకోవడంలో ధనం నిర్వహించే పాత్రను ఎవరు విస్మరించలేరు. అదేవిధంగా డబ్బుతో సుఖ సంతోషాలు రావు అని చెపుతారు కాని మనిషి బతకడానికి మాత్రం డబ్బు లేనిదే ఒక్క క్షణం కూడ గడవదు అన్నది వాస్తవం. 

మనిషికి డబ్బు సంపాదించాలి అని వచ్చే ఆలోచనలు అతడి చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం డబ్బు పట్ల అతడికి ఉన్న అవగాహన వీటన్నిటిని మించి అతడి ఆలోచనా సరళిని బట్టి సంపాదకు సంబంధించిన ఆలోచనా బీజాలు మనిషి మెదడులో ఏర్పడతాయి. వాస్తవానికి ప్రతి మనిషికి డబ్బు సంపాదించాలి అన్న కోరిక ఉన్నా ఎంత సంపాదించాలి అన్న లక్ష్యం స్పష్టంగా లేకపోవడంతో డబ్బు సంపాదన విషయంలో విజయాన్ని చేరుకోలేరు. 

ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక విద్యార్ధికి ఎలా ఒక ప్రణాళిక ఉంటుందో డబ్బు సంపాదించి ఐశ్వర్య వంతుడు కావాలి అని ఆరాటపడే వ్యక్తికి కూడ నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే ఆ వ్యక్తి ధనవంతుడుగా మారడం కష్టం. సంపదను తనకు తాను సృష్టించుకోవాలి అంటే దానికి సంబంధించిన ఆలోచనలు ఆధ్యేయం సాధించడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మనిషికి ఎంతో ఓర్పు ఏకాగ్రతతో పాటు తాను ఎంచుకున్న రంగంలో విజేతగా కొనసాగాలి అంటే ఆ రంగానికి సంబంధించిన విషయాలను నిరంతరం అధ్యయనం చేసే ఒక మంచి విద్యార్ధిగా మారిన వ్యక్తి మాత్రమే ధనవంతుడు అవుతాడు అతడు అనుకున్న గమ్యాన్ని చేరుకోగాలుగుతాడు. అందుకే ఒక జ్యూయలరీ కంపెనీ యాడ్ లో ‘డబ్బులు ఎవరికీ ఊరికినే రావు’ అని అంటాడు ఆ కంపెనీ యజమాని..  

మరింత సమాచారం తెలుసుకోండి: