అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం నాడు కదిరి పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు, 45 మంది విద్యార్థులు కలిసి ఉత్తర కర్ణాటక విహారయాత్రకు ఒక బస్సు లో బయలుదేరాలు. అలా బయల్దేరిన వారు శుక్రవారం రోజు జోగ్‌ జలపాతం వద్ద రాత్రిపూట వరకు ఉత్సహంగా గడిపారు. ఆ తరువాత రాత్రి నిద్రపోయేందుకు బస్సు ఎక్కి మురిడికు పయనమయ్యారు.


అయితే, వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు లోయలో పడింది. దాంతో, ఒక పదవ తరగతి విద్యార్థి బాబా ఫకృద్దీన్‌‌ మరణించాడు. అలాగే ఆరుగురు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 35మంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదానికి బస్సు డ్రైవర్ మద్యం సేవించడమేనని పాఠశాల ప్రిసిపాల్ రాజేంద్రన్‌ ఒక ప్రముఖ వార్త పత్రికతో చెప్పారు.


బస్సు లోయలో పడిగానే అక్కడ ఉన్న స్థానికుల వెంటనే బస్సు అద్దాలను పగలగొట్టి.. అందులో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గాయాలపాలైన వారిని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ దుర్ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, పిల్లలకు తక్షణమే వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. విద్యార్థులు తమ స్వగ్రామాలకు సురక్షితంగా వచ్చేలా ప్రయాణ సౌక్యరాలు కల్పించాలని కోరారు. ఈ ప్రవేటు  బస్సు లోయలో పడే క్రమంలో ఒక చెట్టు దేవుడిలా అడ్డువచ్చిందని.. లేకపోతే ప్రమాద తీవ్రత అధికంగా ఉండి అనేకమంది మృత్యవాత పడేవారని స్థానికులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: