క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు మొదలయ్యాయి.  టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సిబిఐ, ఈడి దాడులు చేసి కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే రాయపాటి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నట్లే అర్ధమవుతోంది. అసలు సిబిఐ, ఈడిలు హఠాత్తుగా రాయపాటి కంపెనీలపై ఎందుకు దాడులు చేశాయి ?

 

ఎందుకంటే కొడుకు రాయపాటి రాసిన లేఖలే తండ్రి పీకల మీదకు తెచ్చిందని సమాచారం.  ఇంతకీ విషయం ఏమిటంటే అర్హత లేని ట్రాన్స్ ట్రాయ్ సంస్ధకు చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఇచ్చారు. దీని విలువ సుమారు 4 వేల కోట్ల రూపాయలు. ఇంత భారీ కాంట్రాక్టు చేసేంత సీన్ ట్రాన్స్ ట్రాయ్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండర్లు మొదలుపెట్టారు. దాంతో  అప్పటి వరకు కాంట్రాక్టు చేసిన నవయుగ అంతకుముందు పనిచేసిన ట్రాన్స్ ట్రాయ్ ఏ స్ధాయిలో ప్రజాధనం దోచుకున్నాయో బయటపడ్డాయి. అదే సమయంలో  రాయపాటి సంస్ధలో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయట.

 

సంస్ధ ఎండిగా ఉన్న చెరుకూరి శ్రీధర్ కు రాయపాటికి మధ్య బాగా గ్యాప్ వచ్చిందని సమాచారం. ఆ గ్యాప్ అలా ఉండగానే రాయపాటి కొడుకు రాయపాటి రంగారావు నుండి ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు సిబిఐ, ఈడిలకు కొన్ని లేఖలు అందాయట. అదేమిటంటే తన తండ్రికి తెలీకుండానే శ్రీధర్ ఇష్టమొచ్చినట్లు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారట.  తన ఆరోపణలకు కొన్ని ఆధారాలను కూడా రంగారావు  అందించారట.

 

ఆర్ధిక అవకతవకలకు స్వయంగా సంస్ధలోని వాళ్ళే ఆధారాలతో సహా ఆరోపణలు చేయటంతో వెంటనే సిబిఐ, ఈడిలు రంగంలోకి దిగి అందరిపైనా దాడలు చేసి కేసులు కూడా నమోదు చేశాయి. కొడుకు రంగారావు అనాలోచితంగా రాసిన లేఖలో తండ్రి పీకల్లోతు ముణిగిపోవటానికి కారణమైనట్లు అర్ధమైపోతోంది. రాయపాటి తగులుకుంటే వందల కోట్ల రూపాయలు అందుకున్న ముఖ్యనేత కూడా తగులుకోవటం ఖాయం.  మరి ఈ సమస్యల నుండి ఇద్దరూ  ఎలా బయటపడతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: