బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) దెబ్బకు చంద్రబాబునాయుడు మైండ్ బ్లాంక్ అయినట్లే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ప్రతి శని, ఆదివారాలు చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు.  ఏపిలో ఉండి కూడా చేసేదేమీ లేదు కాబట్టి కనీసం తెలంగాణాలో మిగిలిన నేతలతో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవచ్చన్న ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ కు వస్తున్నారు.

 

మూడు రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చేసిన దగ్గర నుండి అమరావతి ప్రాంతంలోని ఓ ఐదారు గ్రామాల్లో ఎంతగా ఆందోళనలు జరుగుతున్నది అందరూ చూస్తున్నదే. నిజానికి ఈ ఆందోళనలను చంద్రబాబు, టిడిపి నేతలు దగ్గరుండి మరీ చేయిస్తున్నారు.  అమరావతి రాజధాని అయినా, ఇపుడు జరుగుతున్న ఆందోళనలైన కేవలం ఓ సామాజికవర్గం కోసమే  జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి లేండి.

 

ఈ నేపధ్యంలోనే రాజధాని అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) బృందం తన నివేదికను  శుక్రవారం జగన్మోహన్ రెడ్డికి అందించింది.  అదే సమయానికి హైదరాబాద్ కు రావటానికి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం లాంజ్ లో ఉన్న చంద్రబాబుతో నేతలు ఫోన్లో విషయం చెప్పారు. బిసిజి నివేదికను సిఎంకు అందించిందన్న విషయం తెలియగానే వెంటనే చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకుని మళ్ళీ కరకట్ట దగ్గరకు చేరుకున్నారు.

 

వచ్చీ రావటంతోనే బిసిజి నివేదికను, జగన్ ను కలిపి విమర్శించటం మొదలుపెట్టారు. విద్యార్ధి సంఘాల నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జగన్ తో పాటు తాజా నివేదికను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయంపై తిరగబడాలని, ఉద్యమాలు చేయాలంటూ విద్యార్ధి నేతలను బతిమలాడుకోవటమే విచిత్రంగా ఉంది.

 

ఇప్పటికిప్పుడు బిసిజి నివేదికపై చంద్రబాబు స్పందించినా ఒకటే స్పందిచకపోయినా ఒకటే. సోమవారం అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత బిసిజి నివేదికపై మాట్లాడినా కాదనే వాళ్ళు లేరు. కానీ అలా కాకుండా ఏకంగా హైదరాబాద్ పర్యటననే రద్దు చేసుకున్నారంటే  బిసిజి నివేదికతో చంద్రబాబు మైండ్ ఎంతలా బ్లాంక్ అయిపోయిందో అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: