తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ బోస్టన్ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి సమగ్ర నివేదికను అందజేశారని అన్నారు. గతంలో ఏ కమిటీ రిపోర్టు ఇచ్చినా చెప్పిన అంశాలనే బోస్టన్ కమిటీ చెప్పిందని ఎందుకంటే అది వాస్తవమని అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని చెప్పారు. 
 
రాజధాని ప్రజల వలన అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలే పూనుకొని అభివృద్ధి చేయాలంటే రాజధాని విషయంలో ఫెయిల్ అవుతామని అమర్నాథ్ అన్నారు. కొన్ని పత్రికల్లో మూడు ముక్కలు అని ప్రస్తావించారని ప్రజల్లో ఒక రాజధాని ఉంటే ఇంకోచోట రాజధాని ఉంటే తప్పేంటనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఎందుకు కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 2001 తరువాత హైదరాబాద్ లాంటి నగరం కోసం ఉద్యమం జరిగిందని అలాంటి పరిస్థితి మరలా రాకూడదని అమర్నాథ్ అన్నారు. 
 
అన్ని ప్రాంతాలకు నీరు, నిధులు, పరిపాలన ఇవ్వటం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల నుండి తీసుకున్న భూములకు గత ప్రభుత్వం ఫ్లాట్లు ఇస్తామని చెప్పిందని తాము కూడా ఆ హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. జాతి సమస్యను బాబు జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. 
 
రాజధాని పేరుతో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అమర్నాథ్ అన్నారు. ప్రపంచంలో భూముల రేట్లు తగ్గిపోతున్నాయని ఉద్యమం నాకు తెలిసీ ఎవరూ చేయలేదని చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారని దానికి ఉద్యమం అని పేరు పెట్టాలో లేదో తెలియట్లేదని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎంతోమంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని అమర్నాథ్ అన్నారు. రాజధానిలో భూములను కాపాడుకోవటానికి మాత్రమే భువనేశ్వరి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: