గుంటూరు జిల్లాలో రెండేళ్లుగా వివాహితులు, ఇంకా కాలేజీ అమ్మాయిలతో కొనసాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేసారు పోలీసులు. అయితే, ఈ సెక్స్ రాకెట్ ని నడిపే వ్యక్తి ఒక బి.టెక్ విద్యార్థి కావడంతో నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది.

వివరాల్లోకి పోతే, మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన నిడిగొండ వీర బ్రహ్మం యొక్క తల్లిదండ్రులు అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో, వీరబ్రహ్మం తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నివాసముండేవాడు. అయితే, మనవడి మీద ఉన్న ప్రేమతో తన అమ్మమ్మ కూలి పనులు చేస్తూ వీరబ్రహ్మంను బాగా చదువుకోమని ప్రోత్సహించేది. వీరబ్రహ్మం కూడా అమ్మమ్మ మాట విని బాగా చదువుకునేవాడు. 5తరగతి వరకు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోగా, ఆ తరువాత 6-10వరకు హాస్టల్ లో ఉంటూ మరొక పాఠశాలలో చదివాడు వీర బ్రహ్మం. ఆపై పాలిసెట్ లో సీట్ సాధించి పాలిటెక్నిక్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. తరువాత ఈ-సెట్ లో 2వేల ర్యాంక్ సంపాదించి బిటెక్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అయితే, బీటెక్ చదువుతున్న రోజుల్లో అతడు తన కామకోరికలను తీర్చుకోవాలని ఆన్ లైన్ లో ఒక వైశ్య కోసం వెతికాడు.


ఈ క్రమంలోనే వీరబ్రహ్మంకు రవి అనే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ... 'రూ.30వేలు ఇస్తే మంచి అమ్మాయితో పడకసుఖం పొందొచ్చు' అని వీర బ్రహ్మంతో చెప్పాడు. 'సరే, సరే. నాకు ఓకే', అంటూ వీరబ్రహ్మం రవి బ్యాంకు అకౌంట్ లోకి 30వేలను ట్రాన్సఫర్ చేశాడు. డబ్బులు రాగానే.. రవి మాట్లాడుతూ..'హైదరాబాద్ లోని ఫలానా అడ్రస్ కు వెళితే...అక్కడ ఒక అమ్మాయి నీకోసం రెడీగా ఉంటుంది', అని వీర బ్రహ్మంకు చెప్పాడు.

 


దాంతో, వీర బ్రహ్మం రవి ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి అమ్మాయి కోసం వెతికాడు. కానీ అక్కడ అమ్మాయి లేదు దాంతో వెంటనే రవి మొబైల్ కు కాల్ చేశాడు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడే వీరబ్రహ్మంకు అర్థమైంది తాను మోసపోయానని. తక్షణమే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు కానీ వాళ్ల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. 30వేల రూపాయలు పోగొట్టుకున్నానన్న బాధలో ఉండగా అతడికి ఒక దురాలోచన వచ్చింది. అదేంటంటే, రవి లాగా ఆన్ లైన్ లో వ్యభిచారమనే ముసుగులో డబ్బులు సంపాదించడం.



ఆ ఆలోచనని వెంటనే ఆచరణలో పెట్టి ఒక ఆన్ లైన్ యాప్ ను డెవలప్ చేశాడు. 'ఇక్కడ కాల్ గర్ల్స్ దొరుకును' అని రాసి ఆ యాప్ లో ఆడవాళ్లు ఫోటోలను, వారి వివరాలను పొందుపరచి తన నెంబర్ ను జత చేశాడు వీరబ్రహ్మం. అయితే, ఆ అమ్మాయిలు ఎవరంటే.. ఆర్థిక ఇబ్బందిలతో బాధపడే వివాహితులు, ఇంకా పలు జిల్లాలకు చెందిన విద్యార్దినులు. కొన్ని రోజులోనే ఆ యాప్ ను సందర్శించిన మగవాళ్లు వీరబ్రహ్మంకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా గత రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్నాడు వీరబ్రహ్మం.




ఈ క్రమంలోనే వీరబ్రహ్మంకు మరొక వ్యభిచారా దందాని నడిపే థామస్‌ కుమార్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీళ్లిద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నడిపించడానికి గుంటూరులోని నంది వెలుగు రోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే, ఆ గదికి యువకులు తరుచుగా వస్తుంటే.. స్థానిక ప్రజలు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో, పోలీసులు రైడ్ చేసి వీరబ్రహ్మం, థామస్‌కుమార్‌తో సహా వ్యభిచారం చేసేందుకు వచ్చిన ఓ మహిళను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. విచారణలో వీరబ్రహ్మం ఇద్దరు పిల్లల తల్లయిన ఒక వివాహితతో సహా జీవినం చేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: