ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా వికేంద్రీకరణ అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు ముక్కలు కాకుండా ఉండాలంటే భవిష్యత్తులో అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల లాగా ఉండాలంటే అంతటా అభివృద్ధి జరగాలని.. అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదని అంతటా అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కాకుండా ఉంటుందని జగన్ తెలియజేయడం జరిగింది.

 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వర్గ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏమాత్రం లెక్కచేయకుండా తన సామాజిక వర్గ ప్రజల కోసం తల బినామీల చేతన నాయకుల చేత అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర భూములను ఒత్తిడి చేసి ప్రలోభపెట్టి లాక్కున్నారని అసలు ఏ మాత్రం అమరావతి ప్రాంతం రాజధానిగా పనికి రాదు అని కేంద్ర ప్రభుత్వం కమిటీ చెప్పినా గాని చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాలకోసం తన వారికి మాత్రమే మేలు చేయడం కోసం రాజధాని అమరావతి లో పెట్టడం జరిగిందని అసెంబ్లీలో వైసీపీ నేతలు పేర్కొనటం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశించి మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి జగన్ తీసుకురావడంతో అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు అభద్రతాభావంతో ఉన్న నేపథ్యంలో తాజాగా వైసిపి మంత్రి మోపిదేవి వెంకటరమణ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజధాని రైతుల ను అన్ని విధాల ఆదుకుంటామని..జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటంలో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని అమరావతి ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరిగితే మిగతా ప్రాంత ప్రజలు ఏమవుతారు అని ఇక్కడ నుండి రాజధాని ఎక్కడికి పోదు అన్నట్టుగా మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: